బరువు తగ్గించే తమలపాకు
పెళ్లి, పేరంటం లాంటి సందర్భాలూ సంప్రదాయాల్లో తమలపాకులు ఉండితీరాల్సిందే! విందు భోజనం తర్వాత తాంబూలం సేవించామంటే స్వర్గసౌఖ్యం అనుభూతికొచ్చినట్టే ఉంటుంది.
పెళ్లి, పేరంటం లాంటి సందర్భాలూ సంప్రదాయాల్లో తమలపాకులు ఉండితీరాల్సిందే! విందు భోజనం తర్వాత తాంబూలం సేవించామంటే స్వర్గసౌఖ్యం అనుభూతికొచ్చినట్టే ఉంటుంది. ఇంతకీ తమలపాకులో ఆరోగ్యాన్ని సంరక్షించే సుగుణాలెన్ని ఉన్నాయో తెలుసా...
* బకెట్ నీళ్లలో ఒక తమలపాకును తుంపి వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే దేహానికి మరింత స్వచ్ఛత చేకూరుతుంది. రోజంతా చెమట వాసన రాదు. సాయంత్రం వేళ ఈ ఆకుతో మరిగించిన నీళ్లను చల్లార్చి ముఖం కడుక్కుంటే ఎంతో తేటగా ఉంటుంది.
* తమలపాకును నూరి రాయడం ద్వారా చర్మం ఎర్రబారడం, పేలడం, దద్దుర్లు లాంటి సమస్యలను నివారించవచ్చు.
* ఇది జిహ్వకు రుచిని కలిగించడమే కాదు, ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది. మలబద్ధక సమస్య ఉత్పన్నం కాదు.
* రెండు తమలపాకులు నూరి ముల్తానీ మట్టితో జతచేసి తగినన్ని నీళ్లు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖానికి నునుపుదనం రావడంతో పాటు ఒంట్లో వేడీ తగ్గుతుంది.
* ఇందులో ఉన్న కాల్షియం ఎముకలు, దంతాలకు మేలు చేస్తే, సి-విటమిన్ రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రైబోఫ్లేవిన్ నోటిపూత లాంటి సమస్యలు రానివ్వదు..
* యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నందున పుండ్లు, గాయాలు, కాలిన బొబ్బలు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు మంచి ఔషధం.
* ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల బ్రాంకైటిస్, ఉబ్బసం లాంటి శ్వాసకోశ ఇబ్బందులు అదుపులో ఉంటాయి.
* మధుమేహాన్ని నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తలనొప్పి, కడుపులో అల్సర్లు, కీళ్లనొప్పులు తగ్గుతాయి. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అన్నింటినీ మించి తాజాదనాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
* ఇంత మేలు చేసే తమలపాకు మోతాదు మించితే క్యాన్సర్ లాంటి మహమ్మారితో సహా అనేక అనారోగ్యాలకు కారణమవతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.