బరువు... అనుకున్నట్లు తగ్గాలంటే..

సుమిత్ర బరువు తగ్గాలని, నడక, వ్యాయామాలు చేస్తోంది. అయితే అనుకున్నంతగా సన్నబడటం లేదనే నిరాశ ఆమెలో మొదలైంది. లక్ష్యాన్ని చేరడానికి తమకి తాము ప్రేరణ కలిగించుకుంటూ, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

Updated : 03 Nov 2022 05:30 IST

సుమిత్ర బరువు తగ్గాలని, నడక, వ్యాయామాలు చేస్తోంది. అయితే అనుకున్నంతగా సన్నబడటం లేదనే నిరాశ ఆమెలో మొదలైంది. లక్ష్యాన్ని చేరడానికి తమకి తాము ప్రేరణ కలిగించుకుంటూ, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.

బరువు తగ్గాల్సిన అవసరం లేదా ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి డైరీలో పొందుపరచాలి. పెళ్లికి ముందు సన్నబడాలని కాబోయే వధువులు కోరుకుంటారు. తాము వెళ్లనున్న వేడుకలో అనుకున్న దుస్తులు ఫిట్‌ అవడమే గోల్‌ ఇంకొందరిది. మరికొందరికి ఆరోగ్యరీత్యా బరువు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇలా ఎవరి లక్ష్యాలు వారివి. ఎవరైనా బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఎందుకు, ఎంత తగ్గాలనుకుంటున్నారు, దానికి ఎన్ని నెలలను గడువుగా పెట్టుకుంటున్నారు వంటి వివరాలన్నీ ఆ డైరీలో రాయాలి. అదే ప్రస్తుత లక్ష్యంగా భావించాలి. రోజూ నిద్రలేచిన వెంటనే ఆ పేజీలను తిరగేసి, లక్ష్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అప్పుడే ఆసక్తి పెరుగుతుంది.

సహజంగా.. నెలలోనే 20 కేజీలు తగ్గిపోవాలంటే ఏం చేయాలి.. అనే ఆలోచనలు పక్కన పెట్టి, వాస్తవానికి దగ్గరగా ఆలోచించాలి. జిమ్‌లో చేరితే త్వరగా సన్నబడొచ్చు అనేది కూడా అపోహే. శాస్త్రీయంగా ఎంత బరువు తగ్గాలంటే ఎన్ని రోజులు పడుతుందనేది తెలుసుకోవాలి. రోజూ వ్యాయామాలకు సమయాన్ని కేటాయించుకోవాలి. శిక్షకుడి సూచనలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. జిమ్‌కు వెళుతున్నాం కదా అని.. అమితంగా ఆహారం తీసుకోవడం లేదా పూర్తిగా తిండి మానేయడం.. ఈ రెంటివల్లా ప్రయోజనం లేదు. వ్యాయామాలకు తగిన ఫలితం దక్కాలంటే పోషకాలన్నీ అందేలా, మితంగా ఆహారాన్ని తీసుకోవడంపై నిపుణుల సలహాలు పాటించాలి. లేదంటే సన్నబడటం మాట అటుంచి, అనారోగ్య సమస్యలెదుర్కోవలసి ఉంటుంది.

ప్రోత్సాహం.. బరువు తగ్గాలనే ప్రణాళిక నెరవేరాలనుకునే వారు వెంటనే అనుకున్నది జరగడంలేదని నిరాశ పడకూడదు. తమని తాము ప్రోత్సహించుకుంటూ, కెలోరీలు తగ్గించుకోవడమెలాగో అవగాహన పెంచుకోవాలి. నచ్చిన ఆహారానికి సైతం దూరంగా ఉండటానికి సిద్ధపడాలి. ఆ రోజు చేసిన వ్యాయామాలు, తీసుకున్న ఆహారం వంటి వివరాలను డైరీలో పొందుపరచాలి. ఈ వెయిట్‌లాస్‌ జర్నల్‌ మీలో స్ఫూర్తిని నింపుతుంది. లక్ష్యాన్ని చేరడానికి తోడవుతుంది. బరువు తగ్గడంతోపాటు దానికోసం పాటించిన నియమాలు మరిన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలను అందేలా చేస్తుంది. అనుకున్నట్లుగా లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత, అదే బరువును కొనసాగించడానికి ప్రయత్నించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్