భేషైన బ్రహ్మముద్ర

తగినన్ని నీళ్లు తాగకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం లాంటి కారణాలతో మనలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. మూత్ర పిండాలు సవ్యంగా పని చేయకపోతే శరీరంలో చేరిన వ్యర్థాలూ, హాని చేసే పదార్థాలూ బయటకు వెళ్లవు.

Updated : 12 Nov 2022 04:45 IST

తగినన్ని నీళ్లు తాగకపోవడం, జీవనశైలి సరిగా లేకపోవడం లాంటి కారణాలతో మనలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. మూత్ర పిండాలు సవ్యంగా పని చేయకపోతే శరీరంలో చేరిన వ్యర్థాలూ, హాని చేసే పదార్థాలూ బయటకు వెళ్లవు. రక్తపోటును నియంత్రించే హార్మోన్లు విడుదల కావు. డి-విటమిన్‌ రూపొందడంలో అపసవ్యత చోటుచేసుకుంటుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అదుపు తప్పుతుంది. మరి ఇంత ఉపయుక్తమైన మూత్ర పిండాలను నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఆనక నానా అవస్థా పడాలి కదా! కనుక రోజూ ఏడెనిమిది గ్లాసుల నీళ్లు తాగడం, క్రమబద్ధ జీవనశైలితోబాటు బ్రహ్మముద్ర పాటించి ఆరోగ్యంగా ఉందాం...

ఎలా చేయాలంటే... సౌకర్యంగా ఉండే ఆసనంలో కూర్చుని చేతులను నాభి దగ్గరికి తీసుకురావాలి. బొటనవేళ్లను లోపలికి ముడిచి మిగిలిన నాలుగు వేళ్లతో వాటిని కప్పెడుతున్నట్టుగా మూయాలి. ఫొటోలో కనిపిస్తున్నట్టుగా వేళ్లు ముడిచిన చేతులు ఒకదానికొకటి తాకుతున్నట్టుగా ఒళ్లో ఉంచుకోవాలి. కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఈ బ్రహ్మముద్ర స్వాధిష్టాన చక్రను చురుగ్గా ఉంచుతుంది. అంటే స్వాధిష్టానకు చెందిన పంచేంద్రియాలను అదుపులో ఉంచుతుంది. ఈ చక్ర చురుగ్గా ఉండటం వల్ల మూత్ర పిండాలు, మూత్రాశయ సమస్యలు తగ్గుతాయి. పంచేంద్రియాలు సజావుగా పనిచేస్తాయి. అనారోగ్య సమస్యలు తలెత్తవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని