ఇది తింటే వెరీ గుడ్డు!
రోజూ అల్పాహారం తీసుకోకపోయినా ఫరవాలేదు. కానీ ఉదయాన్నే ఓ గుడ్డు అయినా తింటే శరీరానికి కావలసిన మాంసకృత్తులన్నీ అందుతాయంటారు పోషకాహార నిపుణులు.
రోజూ అల్పాహారం తీసుకోకపోయినా ఫరవాలేదు. కానీ ఉదయాన్నే ఓ గుడ్డు అయినా తింటే శరీరానికి కావలసిన మాంసకృత్తులన్నీ అందుతాయంటారు పోషకాహార నిపుణులు. మరి అందరికీ అందుబాటులో ఉండే చవకైన పోషకాహారంతో ఏం ప్రయోజనాలున్నాయో తెలుసా?
* గుడ్డులో విటమిన్ ఎ, సి, కొద్ది మోతాదులో డి ఉంటాయి. ఎ కంటి చూపుని మెరుగు పరుస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. డి విటమిన్ ఎముకల్ని దృఢంగా మారుస్తుంది.
* కోడిగుడ్డులో.. విటమిన్లతో పాటు మినరళ్లూ ఎక్కువ. ఇవి ఎదిగే పిల్లలకు బలవర్థకంగా ఉంటాయి. గర్భిణులు తీసుకుంటే... గర్భస్థ శిశువుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే ఇందులో ఉండే ఆల్బుమిన్‌లో ప్రొటీన్లు రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేసి రక్తం గడ్డకట్టకుండా చేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలు ఆరోగ్యంగా, బలంగా మారతాయి.
* బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా గుడ్డు తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇందులోని మాంసకృత్తులతో కడుపు నిండిన భావన కలుగుతుంది. కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.