పదే పదే వేడి చేయకండి..!

చలిగాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు, పడేయడం ఎందుకులే అని మరికొందరు... ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు.

Updated : 23 Nov 2022 04:51 IST

చలిగాలుల వేగం పెరిగింది. దాంతో ఏదైనా వేడి వేడిగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు వండుకునే తీరిక లేక కొందరు, పడేయడం ఎందుకులే అని మరికొందరు... ఒకసారి వండిన దాన్ని పదే పదే వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ప్రమాద కరమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే...

* అన్నం మిగిలిందనో, ఒకేసారి వండేస్తే గిన్నెలు కడగక్కర్లేదనో... వండిన అన్నాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా? ఇక, ముందు మాత్రం అలా చేయకండి. ఎందుకంటే... అందులోని బ్యాక్టీరియా ట్యాక్సిన్లను విడుదల చేయడం వల్ల అది విషతుల్యంగా మారుతుంది. పోషకాలనూ కోల్పోవాల్సి ఉంటుంది.

* ఆకుకూరలూ, క్యారెట్‌ను అతిగా ఉడికించడం, రెండో సారి వేడి చేయడం రెండూ సరికాదు. వీటిల్లో ఉండే ఇనుము, నైట్రేట్లు... ఇతర పోషకాలు శరీరానికి ఏ మేలూ చేయకపోగా హానికరంగా మారతాయి. కార్సినోజెనిక్‌ ప్రాపర్టీలు విడుదలై క్యాన్సర్‌కి కారణమవుతాయి. మరీ తప్పనిసరి అయితే బాగా మరిగిన నీళ్లల్లో గిన్నె ఉంచి గోరువెచ్చగా అయ్యాక తినొచ్చు.

* గుడ్లను కూడా వండిన వెంటనే తినేయాలి. తిరిగి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు. అలా చేస్తే అందులోని పోషకాలు వ్యర్థాలుగా మారిపోతాయి. గుడ్లలో సమృద్ధిగా లభించే నైట్రోజన్‌... క్యాన్సర్‌ కారక ఫ్రీరాడికల్స్‌ని విడుదల చేస్తుంది. ఇక, చికెన్‌ని రెండో సారి హీట్‌ చేస్తే అందులోని మాంసకృత్తులు నశిస్తాయి. 

* మాంసకృత్తులు అధికంగా లభించే పుట్టగొడుగుల్ని వండిన వెంటనే తినేయాలి. నిల్వ ఉంచడం, మళ్లీ మళ్లీ వేడి చేయడం రెండూ సరికాదు. ఇలా చేస్తే అందులో ఉండే ప్రొటీన్లు విచ్ఛిన్నమై ఆక్సిడైజ్డ్‌ నైట్రోజెన్‌, ఫ్రీరాడికల్స్‌ చేరతాయి. దాంతో జీర్ణ సమస్యలు, ఇతరత్రా అనారోగ్యాలకు దారితీయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్