వెచ్చదనాన్నిచ్చే వేరుశనగ..

ఆరేళ్ల లిఖితకు చలికాలం వచ్చిందంటే చాలు. జలుబు, దగ్గు, ఒళ్లు వెచ్చబడుతుంది.

Published : 04 Dec 2022 00:03 IST

ఆరేళ్ల లిఖితకు చలికాలం వచ్చిందంటే చాలు. జలుబు, దగ్గు, ఒళ్లు వెచ్చబడుతుంది. లిఖిత వాళ్ల అమ్మ సుజాత కాళ్ల పగుళ్లు, శరీరమంతా పొడారి దురద వంటి సమస్యలతో బాధపడుతుంది. ఇలా కాకుండా, ఇంటిల్లపాదీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారిలా..

కాలంలో వచ్చే అనారోగ్యాలన్నింటికీ చెక్‌ చెప్పాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడమొక్కటే మార్గం. కాలాలకు తగిన ఆహారాన్ని తీసుకుంటే వ్యాధుల నుంచి కుటుంబాన్ని రక్షించుకోవచ్చు.

వేరుశనగ... దీన్లో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, మైక్రో-మేక్రో న్యూట్రియంట్లు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇవి శరీరానికి కవచంలా మారి చలికాలపు అనారోగ్యాల నుంచి కాపాడతాయి. 

పాలు, అంజీరా.. జీవక్రియలను సమన్వయం చేసే శక్తి అంజీరాలో మెండు. ఇది శరీరానికి తక్షణ శక్తినివ్వడమే కాక అధిక బరువు సమస్యను  రానివ్వదు. రోజూ కప్పు పాలల్లో మూడు అంజీరాలను వేసి మరిగించి తీసుకుంటే మంచిది. ఇలా చేస్తే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.

బెల్లం.. ఐరన్‌, ఖనిజ లవణాలు పుష్కలం. దీనివల్ల మహిళలకు, పిల్లలకు ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. రోజూ మితంగా బెల్లాన్ని తీసుకుంటే శీతకాలాన్ని కూడా ఆరోగ్యంగా గడపొచ్చు.

ఉసిరి.. ఇందులోని సి విటమిన్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాల నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఈ పండ్లలోని ఫ్లావనాల్స్‌, రసాయనాలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంతో ఒత్తిడి, ఆందోళన దరి చేరవు. దీంతో మానసికారోగ్యమూ మెరుగు పడుతుంది. ఉసిరిలోని పీచు శరీరంలో త్వరగా కలిసి పోతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయులు త్వరగా పెరగవు. పీచు కారణంగా జీర్ణశక్తి మెరుగు పడి మలబద్ధకం దూరమవుతుంది. శరీరంలోని మలినాలు బయటకు పోయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా హృద్రోగాలు, క్యాన్సర్‌ వంటి అనారోగ్యాలకూ.. దూరంగా ఉండొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్