ఆకర్షణీయంగా నడవాలంటే...

మనలో కొందరు వంగిపోయి నడుస్తుంటారు. ముందుకు వాలి కూర్చుంటారు. దీనివల్ల పరిహాసాలూ, వెక్కిరింపులూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గోముఖాసనం వేయండి. ముఖ్యంగా చలికాలంలో ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.

Updated : 10 Dec 2022 03:38 IST

మనలో కొందరు వంగిపోయి నడుస్తుంటారు. ముందుకు వాలి కూర్చుంటారు. దీనివల్ల పరిహాసాలూ, వెక్కిరింపులూ ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే గోముఖాసనం వేయండి. ముఖ్యంగా చలికాలంలో ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది.

ఎలా చేయాలి... ఫొటోలో చూపిన విధంగా ఒక మోకాలి మీద రెండో మోకాలును ఉంచి కళ్లు మూసుకుని కూర్చోవాలి. వెన్నుభాగాన్ని వంచకుండా తిన్నగా ఉంచాలి. రెండు పాదాలూ రెండు పక్కలకు వస్తాయి. ఏ కాలు పైన ఉందో ఆ చేతిని తల పక్కనుంచి వెనుక వైపునకు తీసుకెళ్లి మోచేతి నుంచి కిందికి మడవాలి. అంటే కుడికాలు ఉన్నప్పుడు కుడి చెయ్యి, ఎడమకాలు ఉన్నప్పుడు ఎడమచెయ్యి అన్నమాట. రెండోచేతిని కింది నుంచి వెనుకకు తీసుకెళ్లి, రెండు చేతులనూ బిగించాలి. ఈ భంగిమలో 30 సెకన్లు ఉండటానికి ప్రయత్నించాలి. ఇదేవిధంగా కాలు, చెయ్యి మార్చి మరో 30 సెకన్లు కూర్చోవాలి.

ఇవీ లాభాలు...  వంగి నడవటం, ఇంటి పని లేదా డెస్క్‌పని చేసేటప్పుడు ముందుకు వాలి కూర్చోవడం వల్ల నడుం, మెడనొప్పి లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటి నుంచి బయటపడేందుకు ఈ ఆసనం ఉపకరిస్తుంది.

గోముఖాసనం వల్ల గూని, భుజాలు ముడుచుకు పోవడం లేదా వీపు భాగాన్ని బిగ పట్టడంలో (ఫ్రోజెన్‌ షోల్డర్స్‌) మార్పు వస్తుంది. నడిచే, కూర్చునే విధానం మారి వెన్ను తిన్నగా ఉంచడం అలవాటవుతుంది. నడకలో హుందాతనంతో శారీరక ఆరోగ్యమే కాదు అందం, ఆకర్షణ తోడవుతాయి.

వెన్ను, భుజాలు, మెడ బలం పుంజుకుంటాయి. భుజాల నొప్పులు, వెన్ను నొప్పి, నడుంనొప్పి, గర్భాశయ కండరాల్లో ఇబ్బందులు.. అన్నిటికీ ఉపశమనం లభిస్తుంది.

గుండె, ఊపిరితిత్తుల కండరాలు బలోపేతం అవుతాయి. ఉదర అనారోగ్యాలు, ఉబ్బసం లాంటి శ్వాసకోశ ఇబ్బందులు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్లు రావు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్