తినాలి... సన్నగా మారాలి

ఇష్టమైన ఆహారం కనిపిస్తే... తినేవరకూ మనసు అదుపులో ఉండదు కొన్నిసార్లు. కానీ ప్రతిసారీ అదుపు తప్పి తింటుంటే మాత్రం కెలొరీలు ఒంట్లో కొండలా పేరుకుపోతాయి.

Updated : 11 Dec 2022 04:49 IST

ఇష్టమైన ఆహారం కనిపిస్తే... తినేవరకూ మనసు అదుపులో ఉండదు కొన్నిసార్లు. కానీ ప్రతిసారీ అదుపు తప్పి తింటుంటే మాత్రం కెలొరీలు ఒంట్లో కొండలా పేరుకుపోతాయి. ఇలా కాకుండా... తీసుకునే ఆహారాన్ని అన్ని పోషకాలూ అందేలా తగ్గు పద్ధతుల్లో తీసుకోగలిగితే... బరువు అదుపులో ఉంటుందంటారు పోషకాహార నిపుణులు. అదెలాగంటారా?

* తినే తిండి ఏదో ఒకటిలే అనుకోవద్దు. దానికీ సరైన ప్రణాళిక అవసరం. ఉదయాన్నే... మాంసకృత్తులు ఎక్కువగా ఉండే అల్పాహారాన్ని తీసుకోండి. దీంతో చాలా సేపు కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ శక్తినీ ఇస్తుంది. శరీరంలో అదనపు ఇన్సులిన్‌ సమస్య కూడా తలెత్తదు. గుడ్డులోని తెల్లసొన, మొలకలతో చేసిన టిఫిన్‌లూ, చీజ్‌, పాలు, ఓట్స్‌ వంటివన్నీ ఈ తరహావే. ఇవి జీవక్రియల్ని చురుగ్గా ఉంచే పిండిపదార్థాలను శరీరంలో విడుదల చేస్తాయి. ఫలితంగా బరువు అదుపుతప్పే సమస్య ఉండదు.

* గుప్పెడు బాదం గింజల్ని నానబెట్టి తినడం కష్టంగా ఉంటే... వాటిని మెత్తగా చేసి ఏ ఇడ్లీ చట్నీలోనో కలిపేయండి. పొద్దున్నే నూనె ఆహారానికి బదులు... ఆవిరి మీద ఉడికించినవి తినండి. మల్టీగ్రెయిన్స్‌తో చేసిన ఇడ్లీలూ, వడలూ వంటివి ప్రయత్నించండి. ఇవి నిదానంగా జీర్ణమై ఏదో ఒకటి తినాలనే తపనకు అడ్డుకట్ట వేస్తాయి. వారంలో ఓసారైన సోయా, సెనగలూ ఉండేలా చూసుకోండి. ఇవి ఫోలిక్‌ యాసిడ్‌తో పాటు... శరీరానికి కావలసినంత  ప్రొటీన్‌, క్యాల్షియంలను అందిస్తాయి.  మొక్కజొన్న, మొలకల చాట్‌ వంటివి ... స్నాక్స్‌గా మేలు.

* రాత్రి భోజనం ఎంత తేలిగ్గా ఉంటే అంత మంచిది. మసాలాలు లేని ఆహారం తినాలి. రాత్రుళ్లు మాంసాహారానికి దూరంగా ఉండండి. మరీ తినాలని అనుకుంటే గ్రిల్డ్‌ చికెన్‌ లేదా సూప్‌లని ప్రయత్నించండి.

* ఘనాహారం బదులు ద్రవరూపంలో ఉండే ఆహారం ఎంచుకుంటే బరువు సమస్య ఉండదు. సూపులూ, చక్కెరలు లేని పండ్ల రసాలూ వంటివి పిండి పదార్థాలను అదుపులో ఉంచి.. బరువు పెరగకుండా చేస్తాయి. ఇందుకు సంబంధించిన ఆహార విధానాలని కచ్చితంగా పోషకాహార నిపుణుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్