జుట్టు ఊడుతోందా? ఈ పొరపాట్లు చేయొద్దు

జుట్టు అందంగా ఒత్తుగా పెరగాలని అందరూ కోరుకుంటారు. కానీ, తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు వెంట్రుకలు రాలేలా చేస్తాయి. జిడ్డుగా ఉంటుందనో, సమయం లేదనో... తలస్నానానికి ముందు నూనె పెట్టరు కొందరు. ఇలా తరచూ చేస్తుంటే... జుత్తు నిర్జీవంగా మారుతుంది.

Updated : 13 Dec 2022 04:57 IST

జుట్టు అందంగా ఒత్తుగా పెరగాలని అందరూ కోరుకుంటారు. కానీ, తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు వెంట్రుకలు రాలేలా చేస్తాయి.

నూనె పెట్టండి: జిడ్డుగా ఉంటుందనో, సమయం లేదనో... తలస్నానానికి ముందు నూనె పెట్టరు కొందరు. ఇలా తరచూ చేస్తుంటే... జుత్తు నిర్జీవంగా మారుతుంది. అందుకే గోరువెచ్చని కొబ్బరినూనెనో, లేదా దానికి అంతే పరిమాణంలో కాస్త ఆముదాన్నో కలిపి తలకు రాసి మర్దన చేయండి. మాడుకి రక్తప్రసరణ అంది జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఎక్కువ సమయం వద్దు: జుట్టుకి రకరకాల పూతలు వేస్తుంటారు. వీటిని అరగంటకు మించి ఉంచొద్దు. లేదంటే జుట్టు బలహీనమై రాలిపోవచ్చు.

తడితో వద్దు: తలస్నానం చేశాక ఎక్కువ సేపు తడి తువాలుతో ఉండటం, తడి జుట్టుని దువ్వడం, అలానే బిగుతుగా అల్లేయడం వంటివీ పొరపాట్లే. ఇవి జుట్టుని మరింత బలహీన పరుస్తాయి. అందుకే గాలికి ఆరనిచ్చి...ఆపై సున్నితంగా దువ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్