Updated : 13/12/2022 04:51 IST

ఆ బాధలకు చెల్లు చీటీ!

చలికి వణుకుతూ... వేడి వేడి టీ తాగితే భలే హాయిగా ఉంటుంది కదూ. అయితే మామూలు చాయ్‌కి బదులు... ఈ రోజ్‌ మసాలా టీ తాగి చూడండి రుచితో పాటూ చక్కటి ఆరోగ్యమూ మీ సొంతం.

చిక్కటి పాలల్లో తేయాకు పొడితో పాటు కాసిని ఎండు గులాబీ రేకలూ, చెంచా తులసి పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, రెండు యాలకుల్ని వేసి మరిగించాలి. బాగా మరిగిన ఈ వడకట్టిన టీకి కాస్త తేనె కలిపి వేడి వేడిగా తాగితే సరి జలుబూ, దగ్గూ వంటివి మాయవుతాయి. ఈ టీల్లో వేసిన పదార్థాల్లో యాంటీ వైరల్‌, యాంటీఫంగల్‌, యాంటీమైక్రోబియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటమే కారణం.

నెలసరి నొప్పులతో బాధపడేవారు ఓ కప్పు రోజ్‌ మసాలా చాయ్‌ని తాగి చూడండి. ఉపశమనం కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ఇందులో వాడే గులాబీల్లో ఉండే విటమిన్‌ ఎ, సిలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటుకు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి పానీయం ఇది. శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరగనీయదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని