ఆ ఇబ్బంది ఉండదిక!

గోళ్ల పక్కన పొరలుగా చర్మం లేస్తుంటుంది. దాన్ని లాగేశామా.. అన్నం, నీళ్లు ఏది తగిలినా విపరీతమైన నొప్పి. ఈ కాలం ఆ అనుభవం చాలామందికే అయ్యి ఉంటుంది. వదిలేద్దామా అంటే చూడటానికేమో బాగోదు. మరేంటి పరిష్కారం?

Published : 07 Jan 2023 01:31 IST

గోళ్ల పక్కన పొరలుగా చర్మం లేస్తుంటుంది. దాన్ని లాగేశామా.. అన్నం, నీళ్లు ఏది తగిలినా విపరీతమైన నొప్పి. ఈ కాలం ఆ అనుభవం చాలామందికే అయ్యి ఉంటుంది. వదిలేద్దామా అంటే చూడటానికేమో బాగోదు. మరేంటి పరిష్కారం?

వాతావరణంలో తేమ తగ్గడం, చలికి చేతులు పొడిబారడం, గోళ్లు కొరికే సమయంలో పక్కన చర్మం దెబ్బతినడం, పోషకలేమి, విపరీతంగా చేతులు కడగడం.. ఈ సమస్యకు ఇలా బోలెడు కారణాలు. పదే పదే చేతులు కడగాల్సొస్తే.. గోరు వెచ్చని నీటిని ఉపయోగించడం మేలు.

కలబంద గుజ్జుతో చేతులను రుద్దండి. ఆరాక కడిగిస్తే సరి. ఇలా తరచూ చేస్తోంటే.. ఈ సమస్య ఉండదు.

చేతులు విపరీతంగా పొడిబారే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. రోజూ ఉదయాన్నే మీగడ, వెన్నపూస, నెయ్యిల్లో ఏదో ఒకదానితో చేతులను బాగా మర్దనా చేయండి. కావాల్సిన తేమ అందడంతోపాటు చేతులు మృదువుగానూ మారతాయి.

ఇంటిపనిలో భాగంగా కూరగాయలు తరగడం తప్పనిసరి. కానీ ఉల్లి, బంగాళదుంప, టొమాటో వంటి వాటిల్లోని ఆమ్లాలూ చేతుల వద్ద చర్మానికి ఈ కాలంలో హాని చేస్తాయిట. కొబ్బరి, ఆలివ్‌, బాదం నూనెల్లో ఏదో ఒక దాన్ని రాత్రిపూట తప్పనిసరిగా చేతులకు పట్టించాలి. కూరగాయలు కోసేముందూ రాసుకుంటే చర్మం ఊడటం అదుపులోకి వస్తుంది.

ఐరన్‌, విటమిన్‌ బి12, బయోటిన్‌ తగ్గినా ఈ సమస్య ఎదురవుతుంది. అవి పుష్కలంగా ఉండే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రోజువారీ ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి. వీలైనంతవరకూ చర్మాన్ని వెచ్చగా ఉండేలా చూసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్