దానిమ్మ తొక్క.. లాభాలెన్నో!

అందానికీ.. ఆరోగ్యానికీ దానిమ్మ సాయపడుతుందని తెలుసు. తొక్కతోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి.  తెలుసుకోవాలంటే చదివేయండి. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేయండి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొంచెం కలిపి గొంతును తాకేలా పుక్కిలించి ఊయండి.

Published : 07 Jan 2023 01:43 IST

అందానికీ.. ఆరోగ్యానికీ దానిమ్మ సాయపడుతుందని తెలుసు. తొక్కతోనూ బోలెడు ప్రయోజనాలున్నాయి.  తెలుసుకోవాలంటే చదివేయండి.

దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేయండి. గోరువెచ్చని నీటిలో ఈ పొడిని కొంచెం కలిపి గొంతును తాకేలా పుక్కిలించి ఊయండి. గొంతునొప్పి, దగ్గు నుంచి ఉపశమనం దొరుకుతుంది.

దీనిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. దద్దుర్లు, యాక్నే, మొటిమలు వంటివి ఉంటే దానిమ్మ తొక్క పొడిలో గులాబీ నీరు, తేనె కలిపి రాసి ముఖమంతా రాసి చూడండి. మృతకణాలు తొలగడమే కాదు.. ఈ సమస్యల నుంచీ ఉపశమనం లభిస్తుంది.

శరీరాన్ని డీటాక్సిఫై చేయడానికి ఎన్నో ప్రక్రియలను ఉపయోగిస్తుంటాం కదా! దానిమ్మ కూడా శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో చాలా బాగా సాయపడుతుంది. ఈ తొక్కలను మరిగించిన నీటిని గోరువెచ్చగా లేదా చల్లగా తాగితే సరి. బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది. అవసరమైతే నిమ్మరసం, తేనెనీ కలుపుకోవచ్చు. అదనపు పోషకాలూ అందుతాయి.

చుండ్రు, వెంట్రుకలు రాలడం వంటి సమస్యలకూ ఇది మంచి పరిష్కారం. కొబ్బరినూనెకు దీని పొడిని కలిపి వేడిచేయాలి. ఆరాక ఏదైనా సీసాలోకి వడపోయాలి. రాత్రిపూట ఈ నూనెను పెట్టుకొని మరుసటి రోజు ఉదయాన్నే గాఢత తక్కువున్న షాంపూతో తలస్నానం చేస్తే సరి. వారానికి రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్