బచ్చలి.. బహు గొప్పది

కాస్తంత దళసరిగా ఉండే బచ్చలాకులో విటమిన్లు, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఉన్నందున మంచి పోషకాహారం.

Published : 11 Jan 2023 00:36 IST

* కాస్తంత దళసరిగా ఉండే బచ్చలాకులో విటమిన్లు, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఉన్నందున మంచి పోషకాహారం.

* బచ్చలికూర మధుమేహాన్ని, ఉబ్బస వ్యాధిని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది.

* మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం ముడతలు పడదు. అందువల్ల ముఖం నేవళంగా, నిగారింపుతో ఉండి వయసును కనపడనివ్వదు. కురులు రాలవు, కుదుళ్లు బలంగా ఉంటాయి.

* కంటిచూపును మెరుగు పరుస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తం గడ్డ కట్టదు. హృద్రోగాలను అరికడుతుంది.

* బచ్చలాకు తరచూ తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవని ఎన్నో అధ్యయనాల్లో తేలింది.

* పీచు ఎక్కువ కనుక జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువున్నందున ఊబకాయం రాదు.

* బచ్చలితో కూర, పచ్చడి ఏదైనా బాగుంటుంది. అరటి, మిర్చి బజ్జీల్లా బచ్చలాకు బజ్జీలు ఘుమ ఘుమలాడుతూ నోరూరిస్తాయి.

* ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనుకునేవారు బచ్చలికూరను ఏదో రూపంలో తరచూ తినాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్