తారల తీరూ.. సరైనదేనా?

తారలంటేనే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో అందరిలాగే వాళ్లూ కాస్త ఒళ్లు చేస్తారు. నిన్న కాక మొన్నేగా ఆలియా పాపకి జన్మనిచ్చింది. అప్పుడే వ్యాయామాలు మొదలుపెట్టేసింది.

Published : 20 Jan 2023 00:57 IST

తారలంటేనే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో అందరిలాగే వాళ్లూ కాస్త ఒళ్లు చేస్తారు. నిన్న కాక మొన్నేగా ఆలియా పాపకి జన్మనిచ్చింది. అప్పుడే వ్యాయామాలు మొదలుపెట్టేసింది. తనే కాదు.. ఎంతోమంది హీరోయిన్లు నెలల వ్యవధిలోనే పూర్వపు స్థితికి వచ్చేశారు. అది సరైన తీరేనా.. నిపుణులేమంటున్నారు?

హజ ప్రసవమైతే.. అదీ ఎలాంటి ఇబ్బందులూ లేనప్పుడైతే రెండు వారాల తర్వాత నుంచి వ్యాయామాలు మొదలు పెట్టొచ్చు. సి-సెక్షన్‌ లేదా శస్త్రచికిత్స అయిన వారైతే కనీసం ఆరు వారాలు ఆగాలి. కొందరిలో ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు. కాబట్టి శరీరం కోలుకుంది, కుట్లు పూర్తిగా నయమయ్యాయి అన్నాకే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి. ఏదేమైనా వైద్య సలహా తప్పనిసరి. అలాగే ఒక్కసారిగా కఠిన వ్యాయామాలొద్దు.

నడక, స్ట్రెచింగ్‌ ఆ తర్వాత పెల్విక్‌ ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లు మేలు. మొదటి ఆరు నెలలూ వారం మొత్తంలో రెండు గంటలకు మించ కూడదు. వార్మప్‌ తప్పనిసరి. తేలిక, మధ్యస్థ స్థాయి వ్యాయామాలకే ప్రాధాన్యమివ్వాలి.  కఠిన వ్యాయామాల జోలికి పోవద్దు. వ్యాయామాలు ప్రారంభించాక ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నొప్పి, కుట్ల దగ్గర లాగినట్లుగా అనిపించినా, త్వరగా అలసిపోతున్నా.. ఆపేయాలి. ఆరు నెలలయ్యాక నచ్చినవి చేసుకోవచ్చు.

ముఖ్యంగా.. ఏ ఇద్దరి శరీరాలూ ఒకలా ఉండవు. కొందరు త్వరగా బరువు తగ్గుతారు.. త్వరగా కోలుకోవచ్చు.. వ్యాయామాలకీ వాళ్ల శరీరం వేగంగా స్పందించొచ్చు. ఇతరులతో పోల్చుకొని ఒత్తిడి పెంచుకోవద్దు. శరీరం మాట వినడం, తగిన నిపుణుల సాయం ముఖ్యం. అప్పుడే ప్రసవం తర్వాత వ్యాయామం సురక్షితం. తారలు చేసేదీ అదే! వాళ్లూ నేరుగా తగ్గడంపైనే దృష్టిపెట్టరు. కోర్‌ స్ట్రెంత్‌ పెంచుకోవడం, తిరిగి ఆరోగ్యంగా తయారవడంపై దృష్టిపెడతారు. ఈ క్రమంలోనే బరువూ అదుపులోకి వచ్చేస్తుంది. ఇదంతా నిపుణుల సలహాలు, సూచనలతోనే సాగిస్తారు. కాబట్టి, సొంత ప్రయత్నాలు వద్దు. నిపుణుల సలహా తీసుకున్నాకే ప్రారంభించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్