Published : 24/01/2023 00:55 IST

కొలాజెన్‌ కోసం..

చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కొలాజెన్‌ ఉత్పత్తి సక్రమంగా జరగాలంటున్నారు నిపుణులు. దీని ఉత్పత్తికి తోడ్పడే ఆహార పదార్థాలను సూచిస్తున్నారిలా.. 

ఉసిరితో.. ఉసిరి యాంటీ ఏజింగ్‌గా పనిచేసి, చర్మ ఆరోగ్యానికి కావాల్సిన కొలాజెన్‌ని ఉత్పత్తి చేస్తుంది. రోజూ ఓ గ్లాసు ఉసిరి రసం తీసుకుంటే పిగ్మెంటేషన్‌ తగ్గి, చర్మం తాజాగా, మృదువుగా, బిగుతుగా మారుతుంది.


ముదురాకుపచ్చని..

ముదురాకుపచ్చ ఆకుకూరలు సహా బ్రకలీ, బీన్స్‌ వంటి ఆకుపచ్చని కూరగాయల్లో ఫ్రీరాఢికల్స్‌ ముందస్తు వృద్ధ్యాపాన్ని నిరోధిస్తాయి. చర్మ ఆరోగ్యానికి తోడ్పడే  కొలాజెన్‌ ఉత్పత్తికి కావలసిన గుణాలు వీటిల్లో మెండుగా ఉంటాయి. అలానే అవకాడోలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా కొలాజెన్‌ ఉత్పత్తికి తోడ్ప డతాయి..


పప్పు..  పాలు..

కందిపప్పులోని కాపర్‌, మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాలు కొలాజెన్‌ ఉత్పత్తిలో ప్రధాన పాత్రవహిస్తాయి. అలాగే పాలు, పెరుగు, పనీర్‌, వెన్న వంటి పాల ఉత్పత్తుల్లోని జింక్‌ కొలాజెన్‌ ఉత్పత్తికి సాయపడుతుంది. చర్మాన్ని నిత్యం మృదువుగా ఉంచుతుంది.


వెల్లుల్లి...

సల్ఫర్‌ పుష్కలంగా ఉండే వెల్లుల్లి శరీరంలో కొలాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులోని ఆల్ఫాలిపోయిక్‌ యాసిడ్‌ కొలాజెన్‌ కణజాలాన్ని ఎప్పటికప్పుడు పునర్నిర్మించగలదు. అలాగే బీటా కెరోటిన్‌, ఏ విటమిన్‌ ఉండే క్యారెట్‌ కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచి, చర్మానికి మృదుత్వం సహా రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.


చేపలో..

అమినో యాసిడ్స్‌ నిండుగా ఉండే చేప కొలాజెన్‌ ఉత్పత్తిలో ముందుంటుంది. చర్మం పొడారకుండా కాపాడుతూ.. అన్ని కాలాల్లోనూ మృదువుగా ఉండేలా చేస్తుంది. అలాగే చికెన్‌లో ప్రొటీన్లు  కొలాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని తాజాగా, మృదువుగా ఉంచుతాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని