పోషకాల పోపులపెట్టె..

ఆరోగ్యం కోసమనీ బోలెడు ఆహార పదార్థాలను ప్రయత్నిస్తుంటాం కదా! మన పోపుల పెట్టేలోనే బోలెడు పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమంటున్నారు. ధనియాలు, జీలకర్ర.. జీర్ణక్రియలకు తోడ్పడే ఎంజైమ్స్‌ ఉత్పత్తిలో ధనియాలు, జీలకర్ర సాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఐరన్‌ మెండుగా ఉంటాయి.

Published : 04 Feb 2023 00:20 IST

ఆరోగ్యం కోసమనీ బోలెడు ఆహార పదార్థాలను ప్రయత్నిస్తుంటాం కదా! మన పోపుల పెట్టేలోనే బోలెడు పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వమంటున్నారు.

ధనియాలు, జీలకర్ర.. జీర్ణక్రియలకు తోడ్పడే ఎంజైమ్స్‌ ఉత్పత్తిలో ధనియాలు, జీలకర్ర సాయపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఐరన్‌ మెండుగా ఉంటాయి. వీటికి రోజూ ప్రాధాన్యమిస్తే అజీర్తి, కడుపుబ్బరం, గుండెలో మంట, మలబద్ధకానికి దూరంగా ఉండొచ్చు. జీలకర్రలో తల్లిపాల ఉత్పత్తిని పెంచే ఔషధ గుణాలుంటాయి.

ఆవాలు.. పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజ లవణాలు... వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. హృద్రోగ సమస్యలను దూరంగా ఉంచుతాయి. మెగ్నీషియం నరాలవ్యవస్థ పని తీరును మెరుగుపరచి ఒత్తిడి, ఆందోళనలను దరి చేరనివ్వదు. పీచు అజీర్తిని దూరం చేస్తుంది. సెలెనియం ఎముకలు, దంతాలు, గోళ్లు, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వృద్ధాప్య ఛాయలను దగ్గరకు రానీయవు.

మిరియాలు.. నరాలవ్యవస్థ పనితీరును మెరుగుపరచి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. ఆందోళన, ఒత్తిడిని దూరం ఉంచుతాయి. జలుబు, దగ్గు, జ్వరాలకూ మంచి మందు.

ఇంగువ.. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఆస్తమాకి దివ్యౌషధం. రక్తంలో చక్కెర స్థాయులను పెరగనివ్వదు. దీన్ని రోజువారీ ఆహారంలో చేరిస్తే.. కడుపుబ్బరం, త్రేన్పులు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

మెంతులు.. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను నియంత్రిస్తాయి. తల్లిపాల ఉత్పత్తిని పెంచే గుణాలు దీనిలో పుష్కలం. శిరోజాలు ఆరోగ్యంగా పెరగడంలోనూ పాత్ర పోషిస్తాయి.

ఎండుమిర్చి... దీనిలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలోని పోషకాలు బరువును అదుపులో ఉంచడంతోపాటు చర్మం, కురులను పరిరక్షిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్