స్వీట్‌ కార్న్‌తో చెక్‌ పెట్టొచ్చు

వేడి వేడి స్వీట్‌ కార్న్‌ చూస్తే నోరూరకుండా ఉంటుందా? అధిక పోషకాలు కలిగిన ఆహారంలో ఇది కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలు తెలుసుకుందామా?

Published : 12 Feb 2023 00:22 IST

వేడి వేడి స్వీట్‌ కార్న్‌ చూస్తే నోరూరకుండా ఉంటుందా? అధిక పోషకాలు కలిగిన ఆహారంలో ఇది కూడా ఒకటి. మరి దీని ప్రయోజనాలు తెలుసుకుందామా?

* మొక్కజొన్న గింజల్లో కెలొరీలు తక్కువ... పీచు ఎక్కువ. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందువల్లే దీన్ని తరచూ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఈ గింజల్లో ఫెరులిక్‌ ఆమ్లం, ఫినోలిక్‌ ఫ్లేవనాయిడ్లూ ఉంటాయి. ఇవి కొన్నిరకాల క్యాన్సర్లను నివారించడమే కాదు, వార్థక్యపు ఛాయల్నీ రానివ్వవు.  

* స్వీట్‌కార్న్‌లో ఉండే ప్రత్యేకమైన బి విటమిన్లు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే ఇందులో ఉండే జియాక్సాంథిన్‌ అనే  యాంటీ ఆక్సిడెంట్‌ నేత్ర సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.  ఈ గింజలు రుచికి తియ్యగా ఉన్నా...ఇందులో తీపిశాతం తక్కువే. స్టార్చ్‌, ఫైబర్‌లు రక్తంలో చక్కెర స్థాయుల్ని కూడా నియంత్రిస్తాయి.  

* మొక్క జొన్న గ్లూటెన్‌ ఫ్రీ. ఇది పడనివారికి చక్కటి ప్రత్యామ్నాయం కూడా. ఈ గింజల్లో మెగ్నీషియం, జింక్‌, పొటాషియం పుష్కలంగా దొరుకుతాయి.  మెనోపాజ్‌ సమయంలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచుతాయి. మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందిస్తాయి.  

* స్వీట్‌కార్న్‌లో ఫొలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యల్ని రాకుండా అడ్డుకుని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని బీ12 రక్తహీనతను తగ్గిస్తుంది. గర్భిణులు తింటే తల్లితో పాటు గర్భస్థ శిశువునీ ఆరోగ్యంగా ఉంచుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్