Published : 14/02/2023 00:23 IST

సలాడ్‌ ఆరోగ్యంగా...

తాజా కూరగాయలు, మాంసాహారంతో చేసే సలాడ్స్‌కు కొన్ని చేర్చి మరింత రుచిని పెంచొచ్చు. అదెలాగంటే..

వెల్లుల్లితో.. నాలుగైదు వెల్లుల్లి రేకలను దోరగా వేయించి చల్లార్చాలి. కప్పు నువ్వులనూనెకు రెండు చెంచాల పార్శీ సెలరీ పొడి, చెంచా రెడ్‌చిల్లీ ఫ్లేక్స్‌ కలపాలి. ఈ మిశ్రమంలో కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి రేకలను కలిపి పొడిసీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే వారంరోజులు నిల్వ ఉంటుంది. మాంసాహారంతో చేసే సలాడ్‌ను తినేముందు దీంతో అలంకరిస్తే చాలు. రుచి రెట్టింపు అవుతుంది.  

చిల్లీ గార్లిక్‌.. మాంసాహారం, గుడ్లుతో చేసే సలాడ్స్‌కు చిల్లీ గార్లిక్‌ డ్రెస్సింగ్‌ రుచిని పెంచుతుంది. నాలుగైదు ఎండుమిర్చి, కప్పు వేరుశనగ, అయిదారు వెల్లుల్లి రేకలను కలిపి దోరగా వేయించి పొడి చేయాలి. కప్పు ఆలివ్‌ నూనె, తగినంత ఉప్పు, అయిదారు మిరియాలను మెత్తగా చేసి కలపాలి. ఇందులో ముందుగా చేసి ఉంచిన వేరుశనగ పొడిని కలిపి భద్రపరిస్తే వారంరోజులు వినియోగించుకోవచ్చు.

హెర్బ్స్‌తో.. కప్పు ఆలివ్‌నూనెలో మూడు చెంచాల వైట్‌ వెనిగర్‌, చెంచా కొత్తిమీర తురుము, అయిదారు పుదీనా ఆకులు, పావు చెంచా మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచితే రెండువారాలు వినియోగించుకోవచ్చు. ఇది అన్ని రకాల సలాడ్స్‌కూ రుచిని అందిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని