ఈ ఆహారంతో వృద్ధాప్య ఛాయలు దూరం..

ముఖంపై ముడతలతో త్వరగా కొందరిలో వృద్ధాప్యఛాయలు కనిపిస్తాయి. కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ ప్రమాదానికి దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

Published : 15 Feb 2023 00:19 IST

ముఖంపై ముడతలతో త్వరగా కొందరిలో వృద్ధాప్యఛాయలు కనిపిస్తాయి. కొన్ని రకాల ఆహారాలను రోజూ తీసుకుంటే ఈ ప్రమాదానికి దూరంగా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

క్యాబేజీ.. ఏ,సీ,డీ విటమిన్లతోపాటు ఇండోల్‌-3-కార్బినోల్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్‌ సమస్యను దరి చేరనివ్వవు. క్యాబేజీలోని బీటా కెరోటిన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపిస్తుంది.

ద్రాక్ష.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షను రోజూ తీసుకోండి. ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మకణాలను నిత్యం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడి చర్మానికి సాగే గుణాన్నిస్తాయి.

టొమాటో.. సి విటమిన్‌, లైకోపిన్‌ సహా యాంటీఆక్సిడెంట్స్‌ ఇందులో నిండుగా ఉంటాయి. ఇవి ముఖంపై ముడతలు, గీతలను త్వరగా రానివ్వవు. ముఖచర్మాన్ని పొడారనివ్వకుండా ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్‌కు టొమాటో ఔషధంలా పనిచేస్తుంది.

బ్లూబెర్రీ.. యాంటీ ఆక్సిడెంట్స్‌, సి, ఈ విటమిన్లు మెండుగా ఉండే ఈ పండ్లు ముఖచర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. వాతావరణ కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షించడమే కాకుండా, హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను దరిచేరనివ్వవు. సాల్సిలిక్‌ యాసిడ్‌ సమృద్ధిగా ఉండి, చర్మంలోని మృతకణాలను బయటకు పంపుతుంది. ఈ పండ్లలోని సి విటమిన్‌, యాంతోసయానిన్‌ శరీరంలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది.

వీటిలోనూ.. చేపలు, గుడ్లు, వెల్లుల్లి, సిట్రస్‌ ఫలాలను రోజూ ఆహారంలో తీసుకుంటే వీటిలో పుష్కలంగా ఉండే కొల్లాజెన్‌ చర్మానికి సాగే గుణాన్నిస్తుంది. ఆకుకూరల్లో నీటిశాతం ఎక్కువగా ఉండటంతో ఇవి చర్మకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. తాజాగా మెరిసేలా చేసి ముందస్తు వృద్ధాప్యఛాయలను నిరోధిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్