Published : 15/02/2023 00:19 IST

నొప్పులు తగ్గించే యూకలిప్టస్‌!

సీజన్‌ మారగానే ముక్కు అదే పనిగా కారడం, దగ్గూ... ఒళ్లు నొప్పులు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు చిన్న ఇబ్బందికే మాత్రలు వేసుకోవడం ఎందుకు అనుకునేవారు ఈ యూకలిప్టస్‌ ఆయిల్‌ని వాడి చూడండి. ...

* ముక్కు అదే పనిగా కారడం...లేదా దిబ్బడేయడం వంటివి జరిగితే కొబ్బరినూనెలో మూడుచుక్కల యూకలిప్టస్‌ నూనె కలిపి ఛాతీకీ, ముక్కుకు రాసుకుని పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెని నేరుగా చర్మంపై రాస్తే ఆ మంటకి చర్మం కందిపోతుంది కాబట్టే ఇలా కొబ్బరి నూనె కలిపి రాయడం. కేవలం కొబ్బరి నూనె అనే కాదు రసాయనాలు లేని ఏ నూనెతో అయినా యూకలిప్టస్‌ గాఢతని తగ్గించుకోవచ్చు.  

* ఒళ్లంతా నొప్పులూ, మెడనొప్పీ, కండరాలు పట్టేయడం వంటివి ఉన్నప్పుడు బాదం నూనెలో రెండు చుక్కల యూకలిప్టస్‌ నూనెని కలిపి నొప్పులున్న ప్రాంతంలో రుద్దితే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది. లేదంటే స్నానం చేసే నీళ్లల్లో రెండు చుక్కలు కలిపి చేయండి. ఉపశమనం లభిస్తుంది.

* ఒత్తిడిగా ఉన్నా, తలనొప్పి వేధిస్తున్నా రెండు చుక్కలు జేబురుమాల్లో వేసుకుని వాసన చూడండి. ఇట్టే మాయమవుతాయి. అయితే, ఏ పని చేసినా మితంగా చేయాలనే సూత్రం మరిచిపోవద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని