Published : 15/02/2023 00:19 IST

ఒత్తిడికి చిట్కా..

అమలకు ఇల్లు, ఆఫీస్‌ అంటూ రోజంతా పని ఉంటుంది.  దీంతో సాయంత్రమయ్యేసరికి ఒత్తిడి. దాన్ని దూరం చేయకపోతే తీవ్ర అనారోగ్యం దరిచేరే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు..

* నచ్చిన స్నేహితురాలితో పది నిమిషాలు మాటాడండి. మనసు దూదిపింజలా మారుతుంది. వీలైతే కలిసి ఓ కప్పు కాఫీ లేదా టీ తీసుకున్నా చాలు. మెదడంతా రిలీఫ్‌ అవుతుంది. కనీసం ఫోన్‌లోనైనా పలకరించాలి. ఎంతటి ఒత్తిడైనా క్షణాల్లో దూరమవుతుంది.

* సన్నిహితులతో ఆ రోజు జరిగిన విశేషాలను పంచుకోండి. ఏదైనా సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతుంటే పరిష్కారాన్ని అడగండి. అది మీ మనసును తేలికపరుస్తుంది. అలా కాసేపు గడిపిన ఆ సమయం మీకెంతో విలువైనదవుతుంది.  

* స్నేహితులతో ఉన్నప్పుడు మీ మధ్య జరిగే సంభాషణ సరదాగా సాగాలి. ఆ నవ్వుల నుంచి వచ్చే సంతోషం మీ మనసులోని భారం, ఒత్తిడిని దూరం చేసి, తేలిక చేస్తుంది. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం వంటివి మిమ్మల్ని తిరిగి ఉత్సాహంగా మారుస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని