మొటిమ భయమా?

ఎటు చూసినా వేడుకలే. మెరిసిపోవాలి అనుకోవడం సహజమే! కానీ ఎప్పుడు మొటిమ పలకరిస్తుందా అన్న భయమూ వెంటాడుతుంటుంది కదూ! తప్పించుకోవాలంటే వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు.

Published : 17 Feb 2023 00:25 IST

ఎటు చూసినా వేడుకలే. మెరిసిపోవాలి అనుకోవడం సహజమే! కానీ ఎప్పుడు మొటిమ పలకరిస్తుందా అన్న భయమూ వెంటాడుతుంటుంది కదూ! తప్పించుకోవాలంటే వీటికి దూరంగా ఉండమంటున్నారు నిపుణులు.

* చక్కెర ఉండే పదార్థాలు, కూల్‌డ్రింక్‌లు, వైట్‌ బ్రెడ్‌, బంగాళదుంప.. వీటికి దూరంగా ఉండండి. అన్నాన్నీ ఒక్కపూటకే పరిమితం చేయండి. వీటిల్లోని కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని ప్రభావితం చేస్తాయి. మొటిమలకీ కారణమవుతాయి.

* పాలు, పాలపదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ యాక్నే సమస్య ఉన్నవారికి మాత్రం వీటితో ఇబ్బందే. కాబట్టి, కొన్నిరోజులు వీటినీ పక్కన పెట్టేయండి. అసలే ఎండ పెరుగుతోంది. వేడిని తట్టుకోవడానికి మాత్రం పలుచని మజ్జిగ తీసుకోవచ్చు.

* వ్యాయామం చేసేవారు ప్రొటీన్‌ పౌడర్లపై ఆధారపడుతుండటం సహజమే. మీరూ అదే కోవా? ఇవీ మొటిమలకు దారితీసేవే. కాబట్టి, దూరం పెట్టాల్సిందే. అందానికీ, ఆరోగ్యానికీ దాల్చినచెక్క ఎంత మేలు చేస్తుందో చెప్పలేం. కానీ మొటిమలు పలకరించొద్దంటే వేడుకల ముందు దీన్ని ఆహారంలో భాగం చేసుకోకపోవడమే మేలు. వీటితోపాటు ఎక్కువగా నీటిని, ద్రవరూప పదార్థాలనీ తీసుకోండి. చర్మానికి తగిన తేమ అందితే పొడిబారడం, నూనెలు అధికంగా విడుదలై యాక్నేకి దారితీసే సమస్యలకు చెక్‌ పెట్టేసినట్లే!

*  కాస్త ఖాళీ ఉన్నామంటే మనసు చిరుతిళ్లవైపు మళ్లుతుంది. అలాగని జంక్‌ ఫుడ్‌ని చూసి నోరు కట్టుకోలేకపోయారో.. పింపుల్‌ని ఆహ్వానించేసినట్టే. ఏదైనా తినాలనిపిస్తే నట్స్‌, పండు వంటివి ఎంచుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్