సత్తువనిచ్చే కొబ్బరి నీళ్లు...

సూర్యుడు అప్పుడే తన ప్రభావం చూపించడం మొదలుపెట్టాడు. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య. ఇలాంటప్పుడు ఒంట్లో సత్తువా తగ్గిపోతుంది. దీనికి చక్కటి ఔషధం కొబ్బరినీళ్లు. మరి దాని ప్రయోజనాలేంటో చూద్దామా! గర్భిణులకు కొబ్బరి నీళ్లు ఎంతో మంచి చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది.

Published : 22 Feb 2023 00:12 IST

సూర్యుడు అప్పుడే తన ప్రభావం చూపించడం మొదలుపెట్టాడు. దీంతో డీహైడ్రేషన్‌ సమస్య. ఇలాంటప్పుడు ఒంట్లో సత్తువా తగ్గిపోతుంది. దీనికి చక్కటి ఔషధం కొబ్బరినీళ్లు. మరి దాని ప్రయోజనాలేంటో చూద్దామా!

గర్భిణులకు కొబ్బరి నీళ్లు ఎంతో మంచి చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్‌ బి9 కడుపులో బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి నీళ్లు లారిక్‌ యాసిడ్‌ని ఉత్పత్తి చేయడం వల్ల తల్లిపాలు సమృద్ధిగా పడతాయి.

కొబ్బరి నీళ్లల్లో దాహాన్ని తీర్చే గుణం మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటు.  పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం.. వంటి ఖనిజ లవణాలు రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. ఇందులోని ఎలక్ట్రోలైట్స్‌ తక్షణ శక్తిని అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.

తక్కువ కొవ్వులు ఉండే కొబ్బరినీళ్లను రోజూ తీసుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ముఖ్యంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎదురుకాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్