ఒమెగా 3 కావాలందుకే!

చక్కని చర్మం, రోగనిరోధకత, చురుగ్గా పనిచేసే మెదడు.. ఇవేగా మనం కోరుకునేది! ఇవి కావాలంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

Updated : 26 Feb 2023 09:41 IST

చక్కని చర్మం, రోగనిరోధకత, చురుగ్గా పనిచేసే మెదడు.. ఇవేగా మనం కోరుకునేది! ఇవి కావాలంటే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఇవి కొరవడితే.. అనేక సమస్యలూ చుట్టుముడతాయి.

* పొడిబారిన చర్మం, కళ తప్పిన వెంట్రుకలు, ఊరికనే విరిగిపోయే గోళ్లు.. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు తగినంత లేకపోవడానికి చిహ్నాలే. ఒక్కోసారి చర్మంపై దద్దుర్లు, చుండ్రుకీ కారణమవుతాయి.

* ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కొలెస్టరాల్‌ తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. దేనిమీదా శ్రద్ధ చూపలేకపోతున్నా.. చిన్న చిన్న విషయాలూ మరిచిపోతున్నా వీటిని ఆహారంలో చేర్చుకోవడం ప్రారంభించండి.

* ప్రసవమయ్యాక, మెనోపాజ్‌లో నడుము, జాయింట్ల నొప్పులు వేధిస్తుంటాయి. వీటిని దూరం చేసుకోవడానికే కాదు.. ఊరికే అలసిపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం వంటి సమస్యలకూ ఈ ఫ్యాటీ యాసిడ్‌లు తప్పనిసరే!

* చేపల నుంచి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. శాఖాహారులైతే అవిసెలు, చియా, వాల్‌నట్స్‌, సోయాబీన్‌ ఆయిల్‌, అవకాడో, నట్స్‌ నుంచి పొందొచ్చు. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. అందం, ఆరోగ్యం, చురుకుదనం.. మీ సొంతం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్