జుట్టు ఎక్కువగా రాలుతోందా...

చిన్నా, పెద్దా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. రోజువారి జీవనశైలిలో నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, జుట్టురాలే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు అంటున్నారు నిపుణులు.

Published : 06 Mar 2023 00:15 IST

చిన్నా, పెద్దా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. రోజువారి జీవనశైలిలో నిద్రకు ఉపక్రమించే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే, జుట్టురాలే సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు అంటున్నారు నిపుణులు... అవేంటో చుద్దామా...

తలస్నానం చేసిన వెంటనే నిద్రొద్దు... తడి జుట్టుతో నిద్రపోవడం మంచిది కాదు. ఇలాంటి సమయంలో కురులు బలహీనంగా ఉంటాయని మరచిపోకండి.  జుట్టును సహజ పద్ధతుల్లో ఆరబెట్టుకుని రెండు మూడు గంటల తరువాత నిద్రపోతే మంచిది.

హెయిర్‌ మాస్క్‌... జుట్టుకు సరైన పోషణను, అవసరమైన తేమను అందించడంలో హెయిర్‌ మాస్క్‌లు బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యానికి హాని కలగకుండా రాత్రంతా జుట్టుకు పట్టి ఉండే మాస్క్‌లను వేసుకుంటే చివర్లు చిట్లవు. మొదళ్ల నుంచి బలంగా తయారవుతాయి.

దువ్వండి... కురులు పలుచగా ఉన్న వాళ్లు దువ్వడానికి సంకోచిస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే జడ వేసుకుంటారు. ఇలా ఒకేసారి చేస్తే ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోతుంది. రాత్రి నిద్రపోయే ముందు దువ్వడం వల్లన చిక్కులు ఉండవు. దాంతో సమస్యా తగ్గుతుంది.

పోనీలు, స్లీప్‌ క్యాప్‌లు వద్దు... నిద్రపోయే సమయంలో జుట్టును వదులుగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి. బిగుతుగా ఉండే పోనీలను వేసుకుని నిద్రపోవడం వల్ల రక్తప్రసరణ లేక మొదళ్ల నుంచి జుట్టు రాలిపోతుంది. మనలో చాలా మందికి స్లీప్‌ క్యాప్‌లు వేసుకుంటేనే కానీ నిద్ర రాదు. ఇవి తలకు గట్టిగా పట్టేసి ఉంటాయి. దానివల్ల వెంట్రుకలు రాలే అవకాశాలు ఎక్కువ. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లన జుట్టురాలే సమస్యల నుంచి బయటపడొచ్చు.

సిల్క్‌ లేదా శాటిన్‌ దిండ్లు... తలకు మెత్తగా దిండు లేనిదే నిద్రపట్టదు కదా! వాటికి కాటన్‌, నైలాన్‌ గలీబులను వేస్తుంటాం. కానీ వీటివల్ల నిద్రపోయే సమయంలో రాపిడి జరుగుతుంది. కురులకు పట్టి ఉండే సహజ నూనెలనూ, తేమను ఇవి పీల్చుకుంటాయి. దాంతో మాడు పొడిబారి జుట్టు రాలిపోతుంది. అలా కాకుండా సిల్క్‌ లేదా శాటిన్‌ దిండు కవర్లను వాడండి. సమస్య ఉండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్