అయినా.. అలసిపోకుండా!

మామూలుగానే ఈ కాలంలో త్వరగా అలసిపోతుంటాం. అదనంగా డైటింగ్‌ కూడా చేస్తోంటే నీరసం ఆవరించేయదూ? మరెలాగంటారా! ఈ చిట్కాలు పాటించేయండి. అలసిపోరు.. బరువుపై బెంగా ఉండదంటున్నారు నిపుణులు. మూడు పూటలా భోజనం తినే విధానాన్ని అనుసరించొద్దు.

Published : 23 Mar 2023 00:11 IST

మామూలుగానే ఈ కాలంలో త్వరగా అలసిపోతుంటాం. అదనంగా డైటింగ్‌ కూడా చేస్తోంటే నీరసం ఆవరించేయదూ? మరెలాగంటారా! ఈ చిట్కాలు పాటించేయండి. అలసిపోరు.. బరువుపై బెంగా ఉండదంటున్నారు నిపుణులు.

మూడు పూటలా భోజనం తినే విధానాన్ని అనుసరించొద్దు. చాలా తక్కువ మొత్తంలో 5-6 సార్లు ఆహారం తీసుకునేలా ప్లాన్‌ చేసుకోండి. రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవు.. నీరసమూ దరిచేరదు.

ప్రోటీన్‌ ఎక్కువగా అందే నట్స్‌, పాలు, పెరుగు, పనీర్‌ వంటివి స్నాక్స్‌లో భాగం చేసుకోండి. శక్తి తరిగిపోతుందన్న బెంగ ఉండదు. పైగా రోజంతా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయివి. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు.. ఏదో రూపంలో తగినంత నీరు శరీరానికి అందేలా చూసుకోవడమూ తప్పనిసరే! తగినన్ని నీరు తీసుకోకపోయినా కళ్లు తిరగడం, నీరసం వంటివి కనిపిస్తాయి.

వేయించిన, నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. ఇవి అరగడానికి ఎక్కువ సమయం తీసుకొంటాయి. శరీరానికీ బద్ధకపు భావన తెచ్చిపెడతాయి. తీపి తినాలనిపిస్తే బెల్లం, తేనెతో చేసినవాటిని ఎంచుకుంటే మేలు.

మిగతా కాలాలతో పోలిస్తే వేసవిలో ఎక్కువ పోషకాలూ అవసరమవుతాయి. తాజా కూరగాయలు, పండ్లు భర్తీ చేయగలవు. కాబట్టి, వీటికి ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్