పెరుగు తింటున్నారా?

కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు యవ్వనంగా కూడా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

Updated : 28 Mar 2023 04:46 IST

కాలం ఏదైనా పెరుగు తింటే చలవే చేస్తుంది. జలుబు చేస్తుందనో, లావైపోతామనో పెరుగుని పూర్తిగా దూరం పెడతారు కొందరు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే వారి జీవితకాలం పెరిగిందని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు యవ్వనంగా కూడా ఉండొచ్చంటున్నారు నిపుణులు.

పెరుగులో మెగ్నీషియం, క్యాల్షియం, విటమిన్లు ఉంటాయి. శరీరంలో మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేస్తాయి. జీర్ణవ్యవస్థని మెరుగుపరచి  మలబద్ధకాన్ని అదుపులోకి తెస్తాయి.

పెరుగు రోజూ తీసుకుంటే ఇందులోని ప్రోబయోటిక్స్‌ మూత్రపిండాల వ్యాధులను అదుపులో ఉంచుతాయి. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించి, రక్త సరఫరాను సమన్వయం చేస్తాయి.

శరీరాకృతిని చక్కగా ఉంచేందుకు వ్యాయామాలు చేసేవారు పెరుగు రోజూ తీసుకోండి. దీనిలో ఉండే ప్రోటీన్లు మంచి ఫలితాన్నిస్తాయి.

కడుపునొప్పితో సహా ఇతర ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా పెరుగుని చికిత్స కోసం ఉపయోగిస్తారు. డయేరియాని కూడా నయం చేస్తుంది. నెలసరి సమయంలో పెరుగు తప్పనిసరిగా తీసుకోవటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్