కరివేపాకే కదా అనుకుంటే..

కూర తాలింపు అన్నాక తప్పకుండా కరివేపాకు వేస్తాం. కంచంలో కనిపించగానే తీసి పక్కన పడేస్తాం. కానీ దీనివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా! అవేంటో చదివేయండి..

Published : 31 Mar 2023 00:15 IST

కూర తాలింపు అన్నాక తప్పకుండా కరివేపాకు వేస్తాం. కంచంలో కనిపించగానే తీసి పక్కన పడేస్తాం. కానీ దీనివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా! అవేంటో చదివేయండి..

* కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. నరాలు, గుండెనాళ వ్యవస్థల పనితీరును మెరుగుపరిచి కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉంచుతాయి.

* కరివేపాకులోని ఫ్లేవనాయిడ్స్‌ యాంటీక్యాన్సర్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ క్యాన్సర్‌ బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.

* ఈ ఆకులు రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. వీటిలోని ఫైబర్‌ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

* ఉదయం వేళల్లో ఉండే నిస్సత్తువని క్రమంగా అదుపులోకి తీసుకురావటమే కాకుండా గర్భిణుల్లో వికారాన్ని తగ్గిస్తుంది. మెదడును చురుగ్గా ఉండేలా చేస్తుంది.

* సాధారణంగానే కరివేపాకు నొప్పిని తగ్గించేందుకు పనిచేస్తుంది. నెలసరి నొప్పులు, మెనోపాజ్‌ సమయంలో కీళ్లనొప్పులను కూడా అదుపులో ఉంచుతుంది. ఈ కాలంలో చాలామందిని అతిదాహం, డీహైడ్రేషన్‌లు వేధిస్తుంటాయి. వీరు చల్లటి మజ్జిగలో కాస్త కరివేపాకు, వాము, నల్ల ఉప్పు కలిపి తాగితే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్