ఆకుకూరలతో అందం, ఆరోగ్యం..

సాధారణంగా ఆకుకూరలను ఇష్టంగా తినేవారి కంటే అయిష్టత ప్రదర్శించేవారే ఎక్కువ. కానీ, వీటిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలిస్తే వాటినే మాత్రం నిర్లక్ష్యం చేయం. అవేంటో చెబుతున్నారు నిపుణులు.

Published : 05 Apr 2023 00:03 IST

సాధారణంగా ఆకుకూరలను ఇష్టంగా తినేవారి కంటే అయిష్టత ప్రదర్శించేవారే ఎక్కువ. కానీ, వీటిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలిస్తే వాటినే మాత్రం నిర్లక్ష్యం చేయం. అవేంటో చెబుతున్నారు నిపుణులు.

* తోటకూర, పాలకూర, మెంతి, బచ్చలి, గోంగూర.. లాంటి ఆకుకూరల్లో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, కాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌, ప్రొటీన్లు, విటమిన్లు వంటివెన్నో వీటిల్లో పుష్కలంగా దొరుకుతాయి. ముఖ్యంగా వీటిలో ఉన్న పీచు జీర్ణప్రక్రియకు తోడ్పడితే.. సి, ఇ విటమిన్లు, బీటా కెరొటిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తాయి, యాంటీఆక్సిడెంట్లు గాయాలను తగ్గిస్తాయి.

* ఆకుకూరల్లో ఉండే కె విటమిన్‌ ఎముకలను పటిష్టంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్‌ బారిన పడకుండా కాపాడుతుంది. జ్వరం, వాతం లాంటి వాటిని నివారిస్తుంది. మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర సాయుల్ని సమతుల్యం చేస్తాయి.

*  ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో పేరుకున్న దోషాలు నశిస్తాయి. మెదడు చురుగ్గా ఉంటుంది. తరచూ ఆకుకూరలు తినేవారిలో జ్ఞాపకశక్తి తగ్గదు, హృద్రోగాలూ రావని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. రక్తప్రసరణ సవ్యంగా సాగుతుంది. రక్తం
గడ్డ కట్టదు.

* పొట్ట దగ్గర కొవ్వు పేరుకోదు, ఊబకాయం రాదు. చర్మానికి మృదుత్వం వస్తుంది. ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

* వీటిని కూర, పచ్చడి రూపంలోనే కాకుండా పకోడీ, సలాడ్స్‌, పెరుగు పులుసు లాంటివి చేసుకుని తినొచ్చు. దళసరిగా ఉండే ముల్లంగి, క్యాలీఫ్లవర్‌ల ఆకులు సైతం మంచి పోషకాహారం. వీటికి పెసరపప్పు కలిపి వండితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్