ఆ సమస్యలకో పరిష్కారం!

ఇల్లు, కెరియర్‌ రెంటినీ సమన్వయం చేసుకునే ఆడవాళ్లే ఎక్కువ. వాటిని సక్రమంగా నిర్వర్తించే క్రమంలో తలనొప్పి, అలసట, కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన వంటివి సహజమే! అన్నిసార్లూ మందులపైనే ఏం ఆధారపడతాం? పైగా ట్యాబ్లెట్లను అతిగా వాడటమూ అంత మంచిది కాదు.

Published : 09 Apr 2023 01:14 IST

ల్లు, కెరియర్‌ రెంటినీ సమన్వయం చేసుకునే ఆడవాళ్లే ఎక్కువ. వాటిని సక్రమంగా నిర్వర్తించే క్రమంలో తలనొప్పి, అలసట, కొన్నిసార్లు ఒత్తిడి, ఆందోళన వంటివి సహజమే! అన్నిసార్లూ మందులపైనే ఏం ఆధారపడతాం? పైగా ట్యాబ్లెట్లను అతిగా వాడటమూ అంత మంచిది కాదు. మీదీ ఆలోచనా? అందుకని సహజ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారా! అయితే కోల్డ్‌ హెడ్‌ రాప్‌ లేదా ఐస్‌ప్యాక్‌ థెరపీ క్యాప్‌ని తెచ్చేసుకోండి. దీనిలో మూడు జెల్‌ ప్యాక్‌లుంటాయి. వీటిని కొద్దిసేపు ఫ్రీజర్‌లో ఉంచాలి. తర్వాత వాటిని క్లాత్‌ ప్యాక్‌లో ఉంచి తలకు చుట్టుకొని విశ్రాంతి తీసుకుంటే సరి. చల్లదనం నొప్పిని తగ్గిస్తే.. కాంతి చొరబడకుండా ఉంచే రాప్‌ కళ్లకీ విశ్రాంతినిస్తుంది. కళ్లు అలసినట్టు అనిపించినా, జ్వరం వచ్చినప్పుడు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రసాయనాల బెడద ఉండదు కాబట్టి, ధైర్యంగా వాడొచ్చు. ప్రయత్నించాలనుందా.. ఆన్‌లైన్‌ వేదికల్లో వెతికేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని