ఊబకాయాన్ని తరిమేస్తుంది..
అన్ని కాలాల్లో, అన్ని చోట్లా దొరికే పండంటే.. అరటిపండే కదూ! అందుకే మండే ఎండల్లోనూ దీనికి కొరత ఉండదు. దీని ఖరీదు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. పైగా ఇదెంతో ఆరోగ్యకరమైంది.
అన్ని కాలాల్లో, అన్ని చోట్లా దొరికే పండంటే.. అరటిపండే కదూ! అందుకే మండే ఎండల్లోనూ దీనికి కొరత ఉండదు. దీని ఖరీదు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. పైగా ఇదెంతో ఆరోగ్యకరమైంది. ముఖ్యంగా మన ఆడవాళ్లు అలక్ష్యం చేయడానికి వీల్లేనిది. ఇంతకీ ఇందులో మేలు చేసే గుణాలేమున్నాయి, ఎందుకు తినాలి అనేగా మీ సందేహం! ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే...
* అరటిపండులో పిండిపదార్థాలు, పీచు, విటమిన్లు, రైబోప్లెవిన్, ఫోలేట్, నియాసిన్, కాపర్, పొటాషియం, మాంగనీస్, సోడియం, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియంలు ఉన్నందున మంచి పోషకాహారం.
* రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
* గుండె, మూత్రపిండాలు, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని రకాల అలర్జీలను తగ్గిస్తుంది. శరీరం ఐరన్‌ను గ్రహించడంలో ఇది తోడ్పడుతుంది.
* అరటిపండులోని యాంటీఆక్సిడెంట్లు అనారోగ్యాలను దరిచేరనివ్వవు. ఈ పండుని తింటే త్వరగా ఆకలి తీరినట్లుంటుంది. దీంతో అధిక ఆహారం తీసుకోవడం, ఊబకాయం రావడం లాంటి అవస్థలకు చోటుండదు.
* అరటిలోని పోషకాలు ఎర్ర రక్త కణాలను వృద్ధిపరుస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచడమే కాదు...కంటి చూపు మెరుగుపరుస్తాయి.
* శరీరంలో హానికరమైన రసాయనాలను తొలగిస్తుంది.
* ఈ పండు త్వరగా అరిగి, తక్షణ శక్తినీ ఇస్తుంది. రోజుకొక అరటిపండు తింటే వేసవి తాపం నుంచి బయటపడొచ్చు. కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్ రూపాల్లో మరింత రుచిగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.