రోజూ నేలపై కూర్చోండి!

ఇప్పుడంటే డైనింగ్‌ టేబుల్స్‌, సోఫాల్లో కూర్చొని భోజనం చేస్తున్నాం కానీ.. ఒకప్పుడు నేలపై కూర్చోనే తినేవారు. ‘ఆ.. పాత తరం పద్ధతులు’ అని కొట్టిపారేయకండి. దాని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అంటున్నారు నిపుణులు.

Published : 10 Apr 2023 00:49 IST

ఇప్పుడంటే డైనింగ్‌ టేబుల్స్‌, సోఫాల్లో కూర్చొని భోజనం చేస్తున్నాం కానీ.. ఒకప్పుడు నేలపై కూర్చోనే తినేవారు. ‘ఆ.. పాత తరం పద్ధతులు’ అని కొట్టిపారేయకండి. దాని వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అంటున్నారు నిపుణులు.

* కచ్చితంగా భోజనమే చేయక్కర్లేదు కానీ.. రోజూ కాసేపు నేల మీద కూర్చోవాలట. అయితే దేనికీ ఆనుకోకుండా కూర్చోవాలి. ఇలా తరచూ చేస్తోంటే వెన్నెముక బలోపేతమవుతుంది. కాళ్లు మడిచి నిటారుగా కూర్చోవడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. కటి ప్రాంతానికీ వ్యాయామమిది.

* నేల మీద కూర్చోవడం కొన్ని రకాల స్ట్రెచ్‌ వ్యాయామాలతో సమానం. ఆహారం జీర్ణమవడంలోనూ సాయపడుతుంది. నిటారుగా కూర్చోవడం వల్ల పొట్టపై ఒత్తిడి పడి, అక్కడి కొవ్వు కరగడంలోనూ సాయపడుతుంది. నెలసరి సమయంలో వచ్చే నొప్పినీ ఇది దూరం చేయగలదు.

* కాళ్లు ముడుచుకొని కూర్చొనే ముద్ర ఒత్తిడినీ దూరం చేయగలదని ధ్యానశాస్త్రం చెబుతోంది. ఈ భంగిమలో శరీరం మొత్తానికి ఆక్సిజన్‌ సరఫరా పెరుగుతుందట. నీ ఓ యూరోపియన్‌ అధ్యయనం.. నేలమీద కాళ్లు ముడుచుకొని కూర్చోవడం లేదా పద్మాసనం వేయడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతోంది.

ఇన్ని ప్రయోజనాలున్నాయి. కాబట్టి.. రోజూ కొద్దిసేపు నేలమీద కూర్చోండి. అలాగని ఒకే భంగిమలో కూర్చోవాలనీ లేదు. పద్మాసనం, సుఖాసనం, కాళ్లు పక్కకి పెట్టి, చాచి.. ఎలాగైనా కూర్చోవచ్చు. అవసరమెతే కింద మెత్తని దుప్పటి, దిండు వేసుకున్నా మంచిదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని