సమస్యల్ని స్కిప్‌ చేసేయండి!

జంక్‌ఫుడ్‌ కావొచ్చు.. మారిన జీవన శైలి కావొచ్చు.. అయ్యి ఉండొచ్చు. టీనేజీ అమ్మాయిలు ఎక్కువగా బరువు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. బరువును నియంత్రించు కోవాలా? స్కిప్పింగ్‌ చేయమంటున్నారు నిపుణులు..

Updated : 11 Apr 2023 03:47 IST

జంక్‌ఫుడ్‌ కావొచ్చు.. మారిన జీవన శైలి కావొచ్చు.. అయ్యి ఉండొచ్చు. టీనేజీ అమ్మాయిలు ఎక్కువగా బరువు పెరుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. బరువును నియంత్రించు కోవాలా? స్కిప్పింగ్‌ చేయమంటున్నారు నిపుణులు..

* గృహిణులు, ఉద్యోగినులు, కౌమారదశ అమ్మాయిలు.. తాడాటని ఎంచుకోవచ్చు. నడుమునొప్పి, శస్త్ర చికిత్సలు అయిన వారు, గర్భిణులు కాకుండా మిగతావారు ధైర్యంగా ఈ వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఇది బరువు తగ్గేందుకు మాత్రమే కాదు. నెలసరి నొప్పులు, మధుమేహం ఇతరత్రా అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది.

* దీనికి సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించాలి. చెప్పులకు బదులుగా షూ అయితే గెంతేటప్పుడు తేలికగా ఉంటుంది. నేల చదునుగా ఉన్న ప్రాంతం లేదా రబ్బరు మ్యాట్‌ని ఎంచుకోండి. పరగడపున మాత్రమే ఆడాలని గుర్తుంచుకోండి. ఆహారం తిన్న తర్వాత శరీరాన్ని కుదిపేస్తే అది జీర్ణమవ్వక ఇబ్బంది పడతారు.

* మీ ఎత్తుకు తగ్గ తాడును ఎంచుకోండి. స్కిప్పింగ్‌కు ముందు వార్మప్‌ చేయాలి. ముందు నెమ్మదిగా గెంతండి. కొంచెం అలవాటయ్యాక క్రమం తప్పకుండా ఈ వ్యాయామాన్ని చేయండి. కొద్ది రోజులు ఆపకుండా చేస్తే బరువు అదుపులో ఉంటుంది.

*  నేలకు కొద్దిపాటి ఎత్తు వరకూ మాత్రమే గెంతండి. అలా చేస్తున్నప్పుడు మీ మోకాళ్లను కొద్దిగా వంచండి లేకపోతే ఒత్తిడి మోకాళ్లపై పడుతుంది. ప్రారంభంలో లెక్కపెట్టుకొని 50, 100 మాత్రమే చేయండి. మీకు బాగా అలవాటయ్యాక 500 వరకూ చేయొచ్చు. మధ్యలో ఏమైనా ఇబ్బందులు వస్తే వైద్యులను సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని