తేనెతో ఎన్ని లాభాలో!
మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే తేనె.. దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. తేనెను ఎప్పుడు ఎలా తీసుకోవాలో చదివేయండి..
మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే తేనె.. దాదాపుగా అందరి ఇళ్లలోనూ ఉంటుంది. తేనెను ఎప్పుడు ఎలా తీసుకోవాలో చదివేయండి..
* హాయిగా నిద్రపోవాలంటే పడుకునే ముందు ఒక చెంచా తేనె తీసుకోవాలి. ఇది మెదడును, శరీరాన్ని గాఢనిద్రలోకి తీసుకెళ్తుంది. అంతే కాకుండా రాత్రిళ్లు తీసుకోవటం వల్ల రక్తపోటూ అదుపులో ఉంటుంది.
* బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఒకగ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో రెండు చెంచాల తేనె, చెంచా నిమ్మరసం వేసుకొని తాగాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి, పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.
* గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల తేనె, ఒక చెంచా నిమ్మరసం కలిపి పరగడుపున పిల్లలకు ఇస్తే సరి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల్లో వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేస్తాయి. పిల్లలకు దగ్గు ఎక్కువ వస్తున్నా తమలపాకు మీద కొంచెం తేనె వేసి తినిపిస్తే, దగ్గు అదుపులోకి వస్తుంది.
* రాత్రి సమయంలో ఒక గ్లాసు నీళ్లలో చెంచా తేనె వేసుకొని తాగాలి. దీంతో ఒత్తిడిని తగ్గించి మెదడు డిప్రెషన్‌కి గురవకుండా ఆపుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.