కాస్త.. ఉత్సాహం కావాలా!
వేసవిలో ఊరికే అలసిపోతున్నట్టుగా.. నీరసం ఆవరించినట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి చేయాల్సిన పనేమో పోగుపడుతుంది. మనకేమో మనస్కరించదు. దూరం చేసుకోవాలా..ఈ చిట్కాలు పాటించేయండి.
వేసవిలో ఊరికే అలసిపోతున్నట్టుగా.. నీరసం ఆవరించినట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి చేయాల్సిన పనేమో పోగుపడుతుంది. మనకేమో మనస్కరించదు. దూరం చేసుకోవాలా.. ఈ చిట్కాలు పాటించేయండి.
* పాటలు వినండి.. అలాగని మంద్రమైన సంగీతాన్ని వినేరు. నిద్ర వచ్చేస్తుంది. హుషారెత్తించే వాటికి ప్రాధాన్యమివ్వండి. ఇది అడ్రినలిన్ ఉత్పత్తికి తోడ్పడి.. శరీరాన్ని ఉత్తేజితం చేస్తుంది.
* వేడి వాతావరణానికి ఒంట్లోని నీరంతా ఆవిరై పోతుంది. దీంతో అలసిపోయినట్లుగా అనిపిస్తుందట. కాబట్టి, ఇంటి పనుల్లో పడి అశ్రద్ధ చేయక.. గుర్తుంచుకొని మరీ నీళ్లు తాగుతుండాలి.
* ఏదో ఒకరోజు అలసట అంటే మామూలే.. రోజూ అనిపిస్తోందా? బీపీ చెక్ చేయించుకోండి. మామూలుగానే డైట్ పేరుతో తక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేవారే ఎక్కువ. బీపీ తగ్గినా అలసినట్లుగా, కళ్లు తిరిగినట్లుగా ఉంటుందట.
* నిద్ర సరిగా ఉంటోందా! క్రమం తప్పకుండా కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇది తగ్గినా నీరసం ఆవరించేస్తుంది. తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటూ అధిక ద్రవపదార్థాలకు ప్రాధాన్యమివ్వండి. ఎక్కువ మొత్తంలో తీసుకునే ఆహారం కూడా బద్ధకం, అలసిన భావనల్ని తెచ్చిపెట్టగలవు.
* చెమటకు భయపడి వ్యాయామం పక్కన పెట్టేయొద్దు. శారీరక శ్రమ కొరవడినా ఉత్సాహం తగ్గుతుంది. ఎలాగూ ఇంటి పని చేస్తున్నాంగా అన్న ధోరణీ పనికి రాదు. నడక, చిన్నపాటి పరుగు, స్ట్రెచ్‌లు కండరాల ఒత్తిడి తగ్గించడమే కాదు.. మనసునీ ఉల్లాసంగా మారుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.