ఒట్టి పాదాలతో నడిస్తేనే ఆరోగ్యం!

మారిన ఉద్యోగ శైలితో... అంతా గంటలు గంటలు కూర్చుని ఉద్యోగాలు చేసేవారే. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఒకచోటే నిల్చునో, కూర్చొనో ఉంటుంటారు. ఫలితమే ఒత్తిడి, అధికబరువు, అనారోగ్యాలు. వీటిని అదుపులో ఉంచుకోవడానికి పెద్ద పెద్ద వ్యాయామాలు చేయనక్కర్లేదు.

Published : 13 Apr 2023 00:07 IST

మారిన ఉద్యోగ శైలితో... అంతా గంటలు గంటలు కూర్చుని ఉద్యోగాలు చేసేవారే. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఒకచోటే నిల్చునో, కూర్చొనో ఉంటుంటారు. ఫలితమే ఒత్తిడి, అధికబరువు, అనారోగ్యాలు. వీటిని అదుపులో ఉంచుకోవడానికి పెద్ద పెద్ద వ్యాయామాలు చేయనక్కర్లేదు. కాసేపు ఒట్టి పాదాలతో నడిస్తే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* కొందరు కాళ్లు పగులుతాయనో, లేక మట్టి చేరుతుందనో నిత్యం సాక్సులతోనే ఉంటారు. కానీ, ఒత్తిడిగా ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా వాటిని తీసేసి నడవాలి. గులకరాళ్లు, ఇసుక తిన్నెలు వంటివాటిపై నడవగలిగితే ఎక్కువ కెలొరీలు ఖర్చవడంతో పాటు ఒత్తిడీ అదుపులో ఉంటుంది.

* ఎప్పుడూ కాళ్లకు చెప్పులు వేసుకునే తిరుగుతుంటే... పాదాలకు రక్తప్రసరణ సరిగా జరగదు. నేలమీద నడవడం అంటే సిమెంట్‌, గ్రానైట్‌ రాళ్లపైన కాదు. మట్టి నేలపై నడవాలి. దీనివల్ల భూమి నుంచి ఎలక్ట్రాన్లు శరీరంలోకి చేరి... ఆక్యుపంక్చర్‌ పాయింట్ల ద్వారా ఒత్తిడిని అదుపు చేస్తాయి. మెదడు సానుకూలంగా పనిచేసేలా చేస్తాయి. ఫలితంగా కాళ్లవాపులూ తగ్గుతాయి. అధిక రక్తపోటు అదుపులోకి వచ్చి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

* మన శరీరంలోని లిగమెంట్లూ, కండరాలూ, కీళ్లూ శక్తిమంత మవుతాయి. ఒట్టికాళ్లతో నడిస్తే వెన్ను, మోకాళ్ల బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఎత్తుపల్లాలుండే చోట నడవకపోవడమే మంచిది. కండరాల బలహీనత, మధుమేహం సమస్యలు ఉన్నవారు ఈ పద్ధతికి దూరంగా ఉంటే మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్