Mask: చిన్నారులకు మాస్కుతో ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ

చిన్నారులకు మాస్కు తప్పనిసరి చేయడం‘అశాస్త్రీయం, ప్రమాదకరం’ అని దిల్లీకి చెందిన జనరల్‌ ఫిజీషియన్‌, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా పేర్కొన్నారు.

Updated : 14 Apr 2023 03:49 IST

వైద్యనిపుణుల హెచ్చరిక

దిల్లీ: చిన్నారులకు మాస్కు తప్పనిసరి చేయడం‘అశాస్త్రీయం, ప్రమాదకరం’ అని దిల్లీకి చెందిన జనరల్‌ ఫిజీషియన్‌, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ చంద్రకాంత్‌ లహరియా పేర్కొన్నారు. మాస్కులను అడ్డదిడ్డంగా వినియోగించడం వల్ల వ్యాధి వ్యాప్తిలో మరింత ప్రమాదం తలెత్తుతుందన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ ఎండమిక్‌ దశలో చిన్నారుల పాత్ర పరిమితమైందని తెలిపారు. కొవిడ్‌ విజృంభిస్తున్న సమయంలోనూ అయిదేళ్ల కంటే చిన్న వయసు వారికి డబ్ల్యూహెచ్‌వో మాస్కులను సిఫారసు చేయని విషయాన్ని చంద్రకాంత్‌ గుర్తు చేశారు. అలాగే 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు కూడా తప్పనిసరికాకుండా ఐచ్ఛికం చేసిందన్నారు. చిన్నారులు మాస్కులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనం చాలా స్వల్పమని ఈ కారణంగా వారికి మాస్కులు అవసరం లేదని వివరించారు. అలాగే హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ..పిల్లలు ఆటలాడుతున్నప్పుడు, శారీరక శ్రమకు గురవుతున్న సమయంలో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాజాగా ప్రభుత్వం నుంచి కరోనాకు సంబంధించి ఎటువంటి నిబంధనలు, మాస్కు తప్పనిసరి ఆదేశాలు లేవు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్