పనీర్‌... తింటున్నారా?

ఆడవారికి క్యాల్షియం చాలా అవసరం. గర్భిణులుగా ఉన్న సమయంలో అయితే ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు. మిగతావారికి ఆహారమే ప్రత్యామ్నాయం. కొందరికి పాలు, పెరుగు నచ్చవు. అలాంటప్పుడు పనీర్‌ తీసుకోండి అంటున్నారు నిపుణులు.

Published : 15 Apr 2023 00:20 IST

ఆడవారికి క్యాల్షియం చాలా అవసరం. గర్భిణులుగా ఉన్న సమయంలో అయితే ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవచ్చు. మిగతావారికి ఆహారమే ప్రత్యామ్నాయం. కొందరికి పాలు, పెరుగు నచ్చవు. అలాంటప్పుడు పనీర్‌ తీసుకోండి అంటున్నారు నిపుణులు.

100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాముల కొవ్వు, ప్రొటీను, తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు  ఉంటాయి. అందువల్ల బరువు పెరుగుతామన్న భయం అక్కర్లేదు. మాంసాహారానికి బదులుగా కూడా పనీర్‌ను తీసుకోవచ్చు. దీంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* పనీర్‌లో క్యాన్సర్‌ని నియంత్రించే స్ఫిన్‌గోలోపిడ్స్‌ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్‌ డి కూడా శరీరానికి కావాల్సిన క్యాల్షియంను అందిస్తుంది.

* పనీర్‌లో ఉండే ఫాస్ఫరస్‌, మెగ్నీషియం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసి తక్షణ శక్తినిస్తుంది. అందువల్ల డైటింగ్‌ చేసే వారు కూడా పనీర్‌ను తగిన మోతాదులో తీసుకోవచ్చు.

* మధుమేహంతో బాధపడుతున్న వారు పాల పదార్థాలను దూరంగా ఉంచుతారు. కానీ ఇందులో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. కాబట్టి వారు నిరభ్యంతరంగా దీన్ని తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని