నిస్సత్తువను దూరం చేసుకుందామా..

మండుటెండల్లో ఇంటా, బయట ఒకే సమస్య. అధిక ఉష్ణోగ్రత చికాకు ఆవరిస్తుంది. ఆకలి వేయదు. వేసినా తినాలి అనిపించదు. అలా అని తినకుండా ఉంటే నిస్సత్తువ కమ్ముకుంటుంది.

Published : 16 Apr 2023 00:51 IST

మండుటెండల్లో ఇంటా, బయట ఒకే సమస్య. అధిక ఉష్ణోగ్రత చికాకు ఆవరిస్తుంది. ఆకలి వేయదు. వేసినా తినాలి అనిపించదు. అలా అని తినకుండా ఉంటే నిస్సత్తువ కమ్ముకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని వేసవి పానీయాలను తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా...

కొబ్బరినీళ్లు: శరీరం డీహైడ్రేట్‌ అవ్వకుండా ఉండాలంటే తగిన నీళ్లు తీసుకోవడం చాలా అవసరం. పైగా నీటిని తాగినా చేదుగా అనిపిస్తుంది ఈ కాలంలో. అలాంటప్పుడు తరచూ కొబ్బరి నీళ్లు తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

నిమ్మరసం:  నిమ్మలో విటమిన్‌ సీ శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. సిట్రిక్‌ యాసిడ్స్‌ జీర్ణవ్యవస్థను సమతుల్యం చేస్తాయి. కార్యాలయాలకి వెళ్లేవాళ్లు, పిల్లలు, పెద్దలకు వేసవిలో నిమ్మరసం ఇవ్వడం వల్ల మంచి రిఫ్రెష్‌మెంట్‌ దొరుకుతుంది. అజీర్తిని నివారిస్తుంది. తక్కువ క్యాలరీలతో ఇమ్యూనిటీని పెంచుతుంది.

మజ్జిగ: బయటి ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సులువైన మార్గం మజ్జిగ. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. క్యాల్షియం, పొటాషియం, విటమిన్‌ బి12 దీనిద్వారా సమృద్ధిగా అందుతాయి.

పండ్లరసాలు:  తర్బూజ, పుచ్చకాయ, చెరకు, స్మూతీస్‌ను తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ సమస్యలు తలెత్తవు. వీటి వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. శరీరంలో నీటినిల్వలు తగ్గినప్పుడు వేగంగా విటమిన్లను, మినరల్స్‌ను చేర్చి శక్తి అందించడానికి ఇవి తోడ్పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని