నెలసరి బాధలా... తగ్గిద్దామిలా!
ప్రతి ఆడపిల్ల జీవితంలో తప్పని ఓ అసౌకర్యం నెలసరి. ఈ సమయంలో కొందరిని కడుపునొప్పి, మరికొందరిని మానసిక ఉద్వేగాలు... ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు మందుల కంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే ముఖ్యమంటారు ఆరోగ్య నిపుణులు.
ప్రతి ఆడపిల్ల జీవితంలో తప్పని ఓ అసౌకర్యం నెలసరి. ఈ సమయంలో కొందరిని కడుపునొప్పి, మరికొందరిని మానసిక ఉద్వేగాలు... ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు మందుల కంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడమే ముఖ్యమంటారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దామా!
* ప్రణాళికతో... రుతుక్రమ ప్రణాళికని వేసుకోవడం వల్ల నెలసరి రోజులు కచ్చితంగా తెలుస్తాయి. ఈ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి మొదట ఆహార మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వేపుళ్లు, మసాలా సంబంధిత ఆహారం ఎక్కువగా తీసుకోకపోవడమే మేలు. పళ్లు, కూరగాయలతో పాటు తృణధాన్యాలతో చేసిన ఆహారం, క్యాల్షియం తగు మోతాదులో ఉండేలా సమతుల ఆహారాన్ని ఎంచుకోవాలి. పాలకూర, తోటకూర వంటి ఆకు కూరల్నీ, పప్పుధాన్యాలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు గింజలు వంటివాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. పీచు పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* వ్యాయామం తప్పనిసరి: నెలసరి సమయంలో తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కావాలన్నా, జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలన్నా కూడా రోజూ తప్పనిసరిగా తగిన వ్యాయామం చేయాలి. కనీసం ఓ పది పదిహేను నిమిషాల నడక, ఇతరత్రా చేసే శ్రమ శరీరాన్ని సౌకర్యంగా కదిలేలా చేయడంతో పాటు నొప్పులనూ తగ్గిస్తాయి.
* వేడివేడి హెర్బల్ టీ: నెలసరి సమయంలో ఒత్తిడి, భావోద్వేగాల నియంత్రణకు కొందరు కాఫీ, టీలను ఎక్కువగా తాగేస్తుంటారు. ఈ సమయంలో వీటికి దూరంగా ఉండటమే మంచిది. మరీ తాగాలి అనిపిస్తే హెర్బల్, ఫ్లోరల్ రకాలను ఎంచుకోండి. అంటే చామంతి, అల్లం, పుదీనా వంటి టీలను వేడి వేడిగా తాగితే సరి. నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.