ఆరోగ్యానికి ద్రాక్ష!

ఈ కాలంలో ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాదు... అనేక పోషకాలను అందించి అనారోగ్యాలనూ దూరం చేస్తాయి.

Published : 20 Apr 2023 00:47 IST

ఈ కాలంలో ఎక్కడ చూసినా ద్రాక్ష పళ్లు విరివిగా కనిపిస్తున్నాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాదు... అనేక పోషకాలను అందించి అనారోగ్యాలనూ దూరం చేస్తాయి.

* ద్రాక్ష పండ్లలో పొటాషియం ఎక్కువ. ఇది అధిక రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. వీటిల్లోని విటమిన్‌ కె, కాపర్‌ రక్తం గడ్డకట్టడంలో ఉండే లోపాలను సరి చేసి... శక్తినీ, ఎముక బలాన్నీ పెంచుతాయి. ముఖ్యంగా మహిళల్ని మెనోపాజ్‌ తర్వాత ఇబ్బంది పెట్టే ఆస్టియోపోరోసిస్‌ సమస్య తీవ్రతను తగ్గిస్తాయి. రక్తహీనతనూ అదుపులో ఉంచుతాయి.

* ఫైబర్‌, విటమిన్‌ బి6, పొటాషియం, విటమిన్‌ సి, మాంగనీస్‌ వంటి పోషకాలు కూడా ద్రాక్షలో ఎక్కువే. కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకోవడం మేలు. ముఖ్యంగా ఫైటోకెమికల్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని తగ్గిస్తాయి. క్యాన్సర్‌ రాకుండా అడ్డుపడతాయి కూడా. ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని బయటకు పంపించి... కణాల పునరుద్ధరణలో కీలకంగా పనిచేస్తాయి.

* వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. అధికబరువుని నియంత్రిస్తాయి. అధికవేడి, దాహం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ గుప్పెడు పళ్లను తింటే ఈ ఇబ్బందులు తగ్గుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని