ఇన్ఫెక్షన్లు తగ్గేలా..
సాధారణంగా మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మధుమేహం ఉన్నప్పుడు, తరచూ యాంటీబయోటిక్స్, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు.
సాధారణంగా మహిళలకు మూత్రాశయ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. మధుమేహం ఉన్నప్పుడు, తరచూ యాంటీబయోటిక్స్, ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడటం వల్ల కూడా ఈ సమస్య రావొచ్చు. నిర్లక్ష్యం చేస్తే దాని తీవ్రత గర్భాశయం వరకూ చేరుతుంది. అందుకే మొదట్లోనే దీనిపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.
నీళ్లను.. మూత్రం తక్కువగా వస్తున్నా, ఆ ప్రాంతంలో మంట అనిపిస్తున్నా శరీరంలో నీటి శాతం తగ్గిందని గ్రహించాలి. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీలైతే కొబ్బరి నీళ్లు తాగితే మంచిది. యూరిన్ వచ్చినప్పుడల్లా వెళ్లండి. ఆపేందుకు ప్రయత్నించకండి. అప్పటికీ ఇన్ఫెక్షన్లొస్తే డాక్టర్‌ను సంప్రదించండి.
ప్రోబయోటిక్స్.. ఇవి శరీరంలోని ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చెడు బ్యాక్టీరియాపై పోరాడేందుకు సాయపడతాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. డాక్టర్ల సలహా మేరకు ప్రోబయోటిక్ పిల్స్ కూడా తీసుకోవచ్చు.
విటమిన్ ‘సి’ తో.. తాజా పండ్లు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ సి అధికంగా ఉండేవైతే ఇంకా మేలు. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా ఉడికించుకొని తినాలి. వేపుళ్లు, మసాలాలకి దూరంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు తగ్గేవరకూ పచ్చళ్లు, ఉప్పు, కారం కూడా తక్కువగా తీసుకుంటే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.