వేళ్లు జాగ్రత్త!
గిన్నెలు తోముతున్నప్పుడు, దుస్తులు ఉతుకుతున్నప్పుడు చేతులు ఎక్కువగా నీళ్లలో నానుతుంటాయి. దీంతో గోళ్ల పక్కనున్న సున్నితమైన చర్మం పొలుసులుగా ఊడి ఒక్కోసారి రక్తమూ వస్తుంటుంది.
గిన్నెలు తోముతున్నప్పుడు, దుస్తులు ఉతుకుతున్నప్పుడు చేతులు ఎక్కువగా నీళ్లలో నానుతుంటాయి. దీంతో గోళ్ల పక్కనున్న సున్నితమైన చర్మం పొలుసులుగా ఊడి ఒక్కోసారి రక్తమూ వస్తుంటుంది. చిన్న గాయమే కానీ నొప్పి విపరీతంగా ఉంటుంది. ఉపశమనానికి ఈ చిట్కాలు పాటించండి.
* నూనెలతో.. చర్మం పొడిబారడంతోపాటు డిటర్జెంట్స్‌లో ఉండే రసాయనాలు కూడా గోరు పక్కన చర్మం ఊడటానికి కారణమే. కొబ్బరి, బాదం, ఆలివ్‌నూనెల్లో తేమను అందించే గుణాలెక్కువ. వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకొని సమస్య ఉన్న ప్రాంతంలో మృదువుగా మసాజ్ చేయాలి. దాంతో అక్కడి చర్మానికి తేమ అంది క్రమంగా ఇబ్బంది తగ్గుతుంది.
* తేనె, అరటిపండు.. శరీరంలో వేడి పెరిగినప్పుడు కూడా చర్మం ఇలా పొలుసులుగా ఊడిపోతుంది. అరటిపండు గుజ్జుకు తేనె కలిపి.. గాయాలున్న చోట రాయాలి. 15 నిమిషాలయ్యాక కడిగేస్తే సరి. గాయం తీవ్రంగా ఉంటే రోజులో రెండు సార్లు రాస్తే సమస్య అదుపులోకి వస్తుంది.
* వెన్నతో.. కాళ్లకు, పెదాల పగుళ్లకు రాస్తుండటం మనకు అలవాటే. ఇది క్యూటికల్స్‌కీ చక్కని పరిష్కారమే! వేళ్ల పక్కన పొట్టు ఊడుతున్న ప్రాంతంలో కొద్దిగా వెన్న రాసి వదిలేయండి. చర్మం మెత్తబడటమే కాదు.. పొలుసులు ఊడటం, నొప్పి వంటివి తగ్గుతాయి. రోజులో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే ఆ గాయాలు వేగంగా తగ్గుతాయి కూడా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.