వెన్నెముక పటుత్వం కోసం..

కాలంతో పాటు ఆహారపుటలవాట్లూ మారుతున్నాయి. పూర్వం 70 ఏళ్లు వచ్చినా సొంతంగా వారి పనులు వారే చేసుకునేవారు. కానీ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో తొందరగా అలసిపోతున్నారు.

Published : 23 Apr 2023 00:28 IST

కాలంతో పాటు ఆహారపుటలవాట్లూ మారుతున్నాయి. పూర్వం 70 ఏళ్లు వచ్చినా సొంతంగా వారి పనులు వారే చేసుకునేవారు. కానీ ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో తొందరగా అలసిపోతున్నారు. 35, 40 ఏళ్లకే నడుంనొప్పి, కీళ్లజబ్బులు.. ఇలా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వెన్నునొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలున్నాయి.. పాటించి చూడండి..

* పౌష్టికాహారంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, పెరుగు, పనీర్‌ తీసుకోవాలి. అలా వీలవలేదంటే.. వైద్యుల సలహాతో పిల్స్‌ రూపంలో తీసుకోవచ్చు.

* క్రమం తప్పక వ్యాయామం చేస్తూ శరీరాన్ని సాగదీస్తుండాలి. ఇలా చేస్తే శరీరం మొత్తం కదిలి అవయవాలన్నీ చురుకుగా మారతాయి. యోగాతో మెడనొప్పి, వెన్నునొప్పి అన్నీ సర్దుకుంటాయి.

* ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువున్నా వెన్ను నొప్పి బాధిస్తుంది. ముందుగా బరువు చెక్‌ చేసుకోవాలి. ఎక్కువుంటే తగ్గ ప్రణాళికతో తగ్గించుకోవాలి.

* నిలబడే, నడిచే, కూర్చునే తీరు సరైన పద్ధతిలో ఉండాలి. లేదంటే నొప్పి ఇంకాస్త ఎక్కువవుతుంది. అసరమయితే నడుం బెల్టు ధరించండి. నిటారుగా కూర్చోవడం, నడవటం అలవాటు చేసుకోండి. పడుకున్నప్పుడు దిండు ఎత్తు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి.

* షూ కానీ చెప్పులు కానీ మీకు అనువైనవే ధరించండి. ఎత్తు చెప్పులకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే వెన్ను సమస్యలు ఎక్కువవుతాయి. ఎప్పుడూ పడుకునే ఉండటం మంచిది కాదు. శరీరాన్ని తగినంత కదిలించకపోతే ఎముకలు నిద్రాణ స్థితికి చేరుకుంటాయి. నొప్పి మరీ తీవ్రమయితే వైద్యులను సంప్రదించాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్