టిఫిన్‌ అంటే విసుగొస్తోందా..

ఉదయాన్నే పిల్లలకు పెట్టే అల్పాహారం ఆరోగ్యంగానూ, రుచిగానూ ఉండాలి. ఏ మాత్రం రుచి తగ్గినా తినేందుకు ఇష్టపడరు. రోజూ అదే ఇడ్లీ, దోశ పెట్టినా తినడానికి మారాం చేస్తారు. తృణధాన్యాలతో టిఫిన్లు ప్రయత్నిస్తే రుచితోపాటు పోషకాలూ అందుతాయంటున్నారు నిపుణులు..

Published : 24 Apr 2023 00:27 IST

ఉదయాన్నే పిల్లలకు పెట్టే అల్పాహారం ఆరోగ్యంగానూ, రుచిగానూ ఉండాలి. ఏ మాత్రం రుచి తగ్గినా తినేందుకు ఇష్టపడరు. రోజూ అదే ఇడ్లీ, దోశ పెట్టినా తినడానికి మారాం చేస్తారు. తృణధాన్యాలతో టిఫిన్లు ప్రయత్నిస్తే రుచితోపాటు పోషకాలూ అందుతాయంటున్నారు నిపుణులు..

సజ్జలు... సజ్జపిండిలో, పెరుగు, తాజా కూరగాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండితో ఊతప్పం, పునుగులు వేసుకోవచ్చు. గ్రీన్‌ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. కావల్సినన్ని పోషకాలూ అందుతాయి.

జొన్నలు.. వీటిలో ఫైబర్‌, ప్రొటీన్లు అధికం. దీన్ని రవ్వ పట్టిస్తే, ఉప్మా చేసుకొని కొబ్బరి చట్నీతో తినొచ్చు. గ్లూటెన్‌ రహిత పోషకాలు ఆరోగ్యంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

అరికెలు... వీటిల్లో క్యాల్షియం ఎక్కువ. కీళ్లనొప్పులు ఉన్న వారు క్రమం తప్పక  తీసుకుంటే మంచి ఔషధం లాగా పని చేస్తాయి. అరికెల్లో కొద్దిగా మెంతులు, మినపప్పు వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే దోశలు వేసుకుంటే సరి.

రాగులు... వీటితో ఇడ్లీ, దోశ తెలిసిన విషయమే. ఇప్పుడు రాగుల సేమ్యా అమ్ముతున్నారు. దాంతో సాధారణ సేమ్యాతో ఉప్మా చేసుకున్నట్టే తేలికగా చేసుకోవచ్చు. దీంట్లో ఇనుము, క్యాల్షియం, ఫైబర్‌ అధికం. రక్తహీనతను కూడా దూరం చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్