ఉప్పూకారాలు చల్లుతున్నారా..
అధిక బరువు తగ్గాలనే ఉద్దేశంతో పండ్లు డైట్‌లో భాగం చేసుకుంటాం. అయితే మనలో చాలామందికి వాటిపై ఉప్పు, కారం, పంచదార లేదా మసాలాలు వంటివి చల్లుకుని తినే అలవాటుంటుంది.
అధిక బరువు తగ్గాలనే ఉద్దేశంతో పండ్లు డైట్‌లో భాగం చేసుకుంటాం. అయితే మనలో చాలామందికి వాటిపై ఉప్పు, కారం, పంచదార లేదా మసాలాలు వంటివి చల్లుకుని తినే అలవాటుంటుంది. కానీ అలాచేస్తే అనారోగ్యాలపాలవటం ఖాయమంటున్నారు నిపుణులు.
* ఉప్పు, మసాలాలు లాంటివి చల్లుకోవటం వల్ల పండ్లలో నీళ్లూరతాయి. దానర్థం అందులో ఉండే కీలక విటమిన్లు, మినరల్స్ బయటకువెళ్లిపోతున్నట్టు. అందుకే పండ్లను తాజాగా తీసుకోవటమే ఉత్తమం.
* బరువు తగ్గుదామని మొదలుపెట్టిన డైట్ కాస్తా, ఉప్పు, కారం, పంచదార వంటివాటితో వ్యతిరేక ఫలితాలనిస్తాయి.
* ఉప్పు, కారాలతో శరీరంలో నీటి శాతం తగ్గిపోయి కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది. అంతేకాక వీటివల్ల పొట్టలో ఉబ్బరం పెరిగి అసౌకర్యంగా ఉంటుంది. వీటికి బదులుగా యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వంటి వాటి పొడి చల్లుకోవచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలూ దరిచేరవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.