చెమట కాయలకు చెక్
వేసవి వచ్చిందంటే పిల్లలను, పెద్దలను చెమట కాయల సమస్య వేధిస్తుంది. దద్దుర్లతో పాటు దురద, మంటలతో విపరీతమైన ఇబ్బంది. వాటిని కొన్ని సహజ చిట్కాలతో నివారించొచ్చు.
వేసవి వచ్చిందంటే పిల్లలను, పెద్దలను చెమట కాయల సమస్య వేధిస్తుంది. దద్దుర్లతో పాటు దురద, మంటలతో విపరీతమైన ఇబ్బంది. వాటిని కొన్ని సహజ చిట్కాలతో నివారించొచ్చు. అవేంటో చదివేయండి మరి!
* పెరుగు చర్మాన్ని చల్లబరుస్తుంది. శరీరంపై చెమటకాయలు ఉన్న చోట పెరుగు రాసి 15 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు దద్దుర్లను తగ్గిస్తాయి.
* గ్లాసు చొప్పున రోజ్‌వాటర్, నీళ్లు తీసుకోవాలి. దానికి నాలుగు చెంచాల తేనె కలిపి.. ఐస్ ట్రేలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. గడ్డకట్టాక ఐస్ క్యూబ్‌లను తీసుకొని పలుచని వస్త్రంలో వేసి చెమటకాయలు ఉన్న ప్రాంతంలో మృదువుగా మసాజ్ చేయాలి. రోజ్ వాటర్ చర్మం పీహెచ్ స్థాయుల్ని బ్యాలెన్స్ చేస్తుంది. తరచూ చేస్తే చర్మానికి హాయి కలిగి, సమస్యను దూరం చేస్తుంది.
* నాలుగు చెంచాల గంధం తీసుకొని దానికి తగినన్ని పాలు చేర్చి, పేస్టులాగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని దద్దుర్లు ఉన్న ప్రాంతంలో రాసి ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. గంధంలో ఉండే సహజ నూనెలు చెమట కాయలనే కాదు.. సన్‌ట్యాన్‌నీ తొలగిస్తాయి.
* మూడు చెంచాల ముల్తానీ మట్టికి.. రెండు చెంచాల పుదీనా పేస్టు, తగినన్ని పాలు కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. దీన్ని చెమటకాయలు ఉన్న ప్రాంతంలో రాసి ఆరనిచ్చి, చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి ఒకటి, రెండుసార్లు ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.