రక్తపోటుతో జాగ్రత్త

గర్భిణుల రక్తపోటులో ఎక్కువ హెచ్చుతగ్గులుంటాయి. అందుకే పోషకాహారం తీసుకుంటూ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే తల్లీ, బిడ్డ... ఇద్దరికీ అనారోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు...

Updated : 26 Apr 2023 00:56 IST

గర్భిణుల రక్తపోటులో ఎక్కువ హెచ్చుతగ్గులుంటాయి. అందుకే పోషకాహారం తీసుకుంటూ దాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేదంటే తల్లీ, బిడ్డ... ఇద్దరికీ అనారోగ్య సమస్యలొస్తాయంటున్నారు నిపుణులు...

* మెదటిసారి గర్భధారణ సమయంలోనే బీపీ సమస్యలు అధికంగా వస్తాయి. అప్పుడు వైద్యుల సలహాల మేరకు ఆహారాన్ని తీసుకోవాలి. గర్భిణులు చేపలు ఎక్కువగా తీసుకుంటే మంచిదంటారు. కానీ వాటిల్లో కొన్ని తినకూడనివి ఉంటాయి. అందుకే వైద్యుల సలహాతో అలాంటివి దూరం పెడితేనే మంచిది. ఒమెగా- 3 ఎక్కువగా, మెర్క్యురీ లేని చేపలను ఎంచుకోవచ్చు. తినొచ్చన్నవీ బాగా ఉడికిన తర్వాతనే తీసుకోవాలి. అప్పుడు బీపీని అదుపులో ఉంచొచ్చు.

* కొన్ని ఆహార పదార్థాలు పాశ్చరైజ్‌ చేయకుండానే మార్కెట్లోకి తీసుకొస్తారు. అలాంటివి తింటే గర్భిణుల్లో రక్తపోటు పెరుగుతుంది. చీజ్‌, పండ్లరసాలు తదితర పదార్థాల ప్యాకెట్ల లేబుల్స్‌ను పరిశీలించాకే కొనుగోలు చేయండి.

* ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తీసుకుంటే అవి శరీరంలో నీరు నిల్వ ఉండేలా చేస్తాయి. అందుకే ఉప్పుని చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీలు, టీలు దూరంగా ఉంచాలి. వీటి వల్ల గర్భాశయంలో రక్త సరఫరా తగ్గి బిడ్డ పెరుగుదల నెమ్మదిస్తుంది. కాబట్టి రోజులో 200 మి.లీ.లకు మించి కెఫిన్‌ తీసుకోకూడదు.

* ఉడికీ ఉడకని ఆహారం అసలు తీసుకోకూడదు. మామూలుగానే గర్భిణుల్లో వికారం, గ్యాస్ట్రిక్‌ సమస్యల వల్ల అజీర్తి చేస్తుంది. ఇక సరిగా ఉడకని పదార్థాలను తీసుకుంటే వాంతులు, విరేచనాలు అవ్వొచ్చు. గుడ్డు, మాంసం వంటివి పూర్తిగా ఉడికాకే తీసుకోవాలి. ప్రాసెస్‌ చేసిన చికెన్‌, జంక్‌ఫుడ్‌ కారణంగా కూడా రక్తపోటు పెరుగుతుంది. ఇలాంటివి సాధ్యమైనంత వరకూ తగ్గించేస్తే మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని