రోజును త్వరగా ప్రారంభిద్దాం..

మనలో చాలామందికి పొద్దెక్కాక లేవటం అలవాటు. కానీ వేకువజామునే నిద్ర లేవటం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Published : 27 Apr 2023 00:09 IST

మనలో చాలామందికి పొద్దెక్కాక లేవటం అలవాటు. కానీ వేకువజామునే నిద్ర లేవటం వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అవేంటంటే..

ఉత్పాదకత.. ఉదయాన్నే నిద్ర లేవటం వల్ల రోజులో ఏమేం పనులు చేసుకోవాలి, ముఖ్యమైనవి ఏవి అన్న ప్రణాళిక వేసుకోవటానికి తగినంత సమయం దొరుకుతుంది.

మానసిక ఆరోగ్యం.. వేకువజామున లేవటం వల్ల ఆందోళన, డిప్రెషన్‌ వంటివి దరిచేరవు. సకాలంలో పనులు పూర్తవుతాయి. దాంతో ఎటువంటి ఒత్తిడీ ఉండదు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం.

తినే అలవాట్లు.. త్వరగా నిద్ర లేచే వాళ్లలో తిండి విషయంలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటాయట. అలానే అల్పాహారం తీసుకోవటం మరవరు. ఆరోగ్యంగానూ ఉంటారు.

సృజనాత్మకత.. ఎక్కువ సమయం ఉండటం వల్ల పూర్తి శ్రద్ధ, ఏకాగ్రతతో పని చేయొచ్చు. దాంతో మనలోని సృజనాత్మకత పెరుగుతుంది.  

నాణ్యమైన నిద్ర.. త్వరగా నిద్రలేవటం వల్ల రోజులో ఎక్కువ సేపు చురుగ్గా ఉంటాం. కాబట్టి శరీరానికి తగినంత శ్రమ దొరికి రాత్రి త్వరగా నిద్రలోకి జారుకోవటమే కాదు నాణ్యమైన నిద్రా మన సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్