మొటిమలిలా మాయం

యుక్తవయసు ఆడపిల్లల్ని అతిగా బాధించే సమస్య మొటిమలు. చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఇవి పెరిగి, వేధిస్తుంటాయి.

Published : 27 Apr 2023 00:09 IST

యుక్తవయసు ఆడపిల్లల్ని అతిగా బాధించే సమస్య మొటిమలు. చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఇవి పెరిగి, వేధిస్తుంటాయి. కొన్నిసార్లైతే మరీ ఎక్కువగా వస్తుంటాయి. మన వంటింటి పదార్థాలతోనే వీటి నుంచి ఉపశమనం పొందొచ్చు.

నిమ్మ, వెనిగర్‌... వెనిగర్‌లో మొటిమల కణాలను విచ్ఛిన్నం చేసే శక్తి ఉంటుంది. వెనిగర్‌ను, నిమ్మ రసాన్ని సమపాళ్లలో తీసుకుని దూదిని వేసి నానబెట్టాలి. గంట తరువాత ఆ మిశ్రమాన్ని మొహానికి ఆప్లై చేస్తే సరి. ఆరిన తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. సాధారణ వెనిగర్‌కు బదులుగా ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను ఉపయోగించవచ్చు.

వంటసోడా... బేెకింగ్‌ సోడాలో  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలను కలిగించే ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. రెండు చెంచాల నిమ్మరసంలో చెంచా వంటసోడా వేయాలి. ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. ఆరాక కడిగేయాలి. రోజులో రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు.

వెల్లుల్లి... దీనిలో యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉంటాయి. మొటిమలు రావడానికి కారణమైన బాక్టీరియాతో పోరాడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని మెత్తగా చేసి దానికి చెంచాడు నిమ్మరసాన్ని జోడించాలి. మొహానికి ఆప్లై చేసి 2, 3 గంటల తరువాత కడిగేస్తే సరి.

టీట్రీ ఆయిల్‌... చెంచా నిమ్మరసంలో 5 నుంచి 8 చుక్కల టీట్రీ ఆయిల్‌ని కలపండి. దీన్ని క్రమం తప్పక మొహానికి రాసుకుని, కాసేపాగి కడిగేస్తే చక్కటి ఫలితాన్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్